ఒలంపిక్ హీరో నీరజ్ చోప్రాపై కియారా అద్వానీ క్రష్.. ఆమె కామెంట్స్ విన్నారా!

pratap reddy   | Asianet News
Published : Aug 20, 2021, 03:42 PM IST
ఒలంపిక్ హీరో నీరజ్ చోప్రాపై కియారా అద్వానీ క్రష్.. ఆమె కామెంట్స్ విన్నారా!

సారాంశం

కియారా అద్వానీ సౌత్ లో హైయెస్ట్ పైడ్ హీరోయిన్లలో ఒకరు. తన హాట్ లుక్స్ తో కుర్రాళ్లని మాయ చేస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ తన షేర్షాహ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

కియారా అద్వానీ సౌత్ లో హైయెస్ట్ పైడ్ హీరోయిన్లలో ఒకరు. తన హాట్ లుక్స్ తో కుర్రాళ్లని మాయ చేస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ తన షేర్షాహ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వానీ ఒలంపిక్ హీరో నీరజ్ చోప్రా పై తన క్రష్ బయట పెట్టింది. 

ఇండియన్ అథ్లెటిక్ చరిత్రలో 100 ఏళ్ల తర్వాత గోల్డ్ మెడల్ సాధించిన వీరుడిగా నీరజ్ చోప్రా ఘనత సాధించాడు. 23 ఏళ్ల కుర్రాడు నేషనల్ హీరోగా అవతరించడమే కాదు.. లక్షలాది మంది యువతులకు క్రష్ గా మారాడు. 

నీరజ్ చోప్రా కు ఫిదా అయిన వారి జాబితాలో అందాల భామ కియారా అద్వానీ కూడా ఉంది. ఈ ఇంటర్వ్యూలో షేర్షాహ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా కూడా పాల్గొన్నాడు. నీరజ్ చోప్రాకి సంబంధించిన ప్రస్తావన ఇంటర్వ్యూలో వచ్చింది. అతడు నిజమైన షేర్షాహ్.. దేశానికి గర్వకారణంగా నిలిచాడు అని సిద్దార్థ్ మల్హోత్రా కామెంట్స్ చేశాడు. 

కియారా అద్వానీ మాట్లాడుతూ.. అతడు నేషనల్ క్రష్ మాత్రమే కాదు.. వరల్డ్ క్రష్ అని పేర్కొంది. జావెలిన్ త్రోలో ఏకచత్రాధిపత్యంగా నీరజ్ చోప్రా టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎగరేసుకు వచ్చాడు.  అతడి స్టయిల్, కాన్ఫిడెన్స్, పెర్ఫామెన్స్ ప్రతి ఒక్క అంశం అందరిని ఆకట్టుకుంది. 

ఇదిలా ఉండగా కియారా అద్వానీ త్వరలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంలో నటించనుంది. మరి కొన్ని టాలీవుడ్ చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. కియారా ఇప్పటికే భరత్ అనే నేను, వినయవిధేయ రామ చిత్రాల్లో నటించింది. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి