అన్నయ్య వరుణ్‌ తేజ్‌కి నిహారిక రాఖీ గిఫ్ట్

Published : Aug 20, 2021, 02:54 PM IST
అన్నయ్య వరుణ్‌ తేజ్‌కి నిహారిక రాఖీ గిఫ్ట్

సారాంశం

మెగా డాటర్‌ నిహారికా.. తన అన్నయ్య వరుణ్‌ తేజ్‌కి రాఖీ పండుగ సందర్బంగా అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. అన్నా చెల్లెలి అనుబంధాన్ని చాటే ఓ అద్భుతమైన పాటని వరుణ్‌కి అంకితమిస్తున్నట్టు ప్రకటించింది.

మెగా డాటర్‌ నిహారిక తన అన్నయ్యకి గిఫ్ట్ ఇచ్చింది. హీరో వరుణ్‌ తేజ్‌కి రాఖీ పండుగకి ముందే స్పెషల్‌ గిఫ్ట్ నిచ్చింది. ఓ పాటని అంకితం చేసింది. అన్న, చెల్లెలి అనుబంధం చాటే పాటని పంచుకుంది నిహారిక.  `అన్నయ్యా నువ్వు పిలిస్తే.. ` లిరికల్‌ పాటని తన అన్నయ్య వరుణ్‌ తేజ్‌ అంకితం చేస్తున్నట్టు తెలిపింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది నిహారిక. ప్రస్తుతం ఈ పాట ఉన్నట్టుంది వైరల్‌గా మారింది. 

అవికాగోర్‌, నవీన్‌ చంద్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `బ్రో`. అన్నా చెల్లెలి అనుబంధం, అనురాగం, ఆప్యాయతలు తెలిపే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. రాఖీ పండుగని పురస్కరించుకుని ఈ చిత్రంలోని `అన్నయ్యా నువ్వు పిలిస్తే..`అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటని సింగర్‌సునీత పాడటం విశేషం. కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్‌ చంద్రా సంగీతం అందిస్తున్నారు.

 

నిహారిక గతేడాది డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వైవాహిక జీవితంలో బిజీగా ఉంది.మరోవైపు తన ప్రొడక్షన్‌లో వెబ్‌ సిరీస్‌ని నిర్మిస్తుంది నిహారిక. ఇక వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం `గని`, `ఎఫ్‌3` చిత్రాల్లో నటిస్తున్నారు. మెగా బ్రదర్‌ నాగబాబు తనయులు వరుణ్‌తేజ్‌, నిహారిక అనే విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం