IFFM 2021: రెబల్ గా సమంత నటనకు దిగివచ్చిన అవార్డు

pratap reddy   | Asianet News
Published : Aug 20, 2021, 02:17 PM IST
IFFM 2021: రెబల్ గా సమంత నటనకు దిగివచ్చిన అవార్డు

సారాంశం

గ్లామర్ తో పాటు నటనకు ప్రతిరూపంగా మారిపోయింది సమంత. సౌత్ లో మాత్రమే స్టార్ గా ఉన్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2తో ఒక్కసారిగా నార్త్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

గ్లామర్ తో పాటు నటనకు ప్రతిరూపంగా మారిపోయింది సమంత. సౌత్ లో మాత్రమే స్టార్ గా ఉన్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2తో ఒక్కసారిగా నార్త్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. శ్రీలంక రెబల్ గా ఆమె నటనకు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. 

తొలిసారి సమంత యాక్షన్ తో ఈ వెబ్ సిరీస్ లో అదరగొట్టింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ఇండియా మొత్తం బిగ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తన మేకోవర్ మార్చుకోవడంతో పాటు.. తొలిసారి విభిన్నమైన పాత్రలో మెప్పించేందుకు కష్టపడింది. 

సమంత కష్టానికి ప్రతిఫలంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురిశాయి. తాజాగా ఆమె ప్రతిభకు నిదర్శనంగా ఓ అవార్డు ఆమె ముందు వాలింది. ఐఎఫ్ఎఫ్ఎమ్ (ఇండియన్ ఫిలిం ఫెస్టివెల్ ఆఫ్ మెల్బోర్న్) 2021కి గాను సమంత వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ ఫిమేల్ పెర్ఫామెన్స్ గా అవార్డు గెలుచుకుంది. 

వివాహం తర్వాత కూడా సమంత జోరు ఏమాత్రం తగ్గడం లేదు. నటనకు ప్రాధ్యానత ఉన్న పాత్రలే ఆమెని వరిస్తున్నాయి. ఓ బేబీ, రంగస్థలం, రీసెంట్ గా ఫ్యామిలిమ్యాన్ 2 లాంటి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. 

సమంత తన నటనతో ఆ చిత్రాల స్థాయిని పెంచుతోంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి