
కియారా అద్వాని చాలా తక్కువ టైమ్ లో బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా..స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది బ్యూటీ. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్నకియారా బ్యూటీతో .. యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేసింది.
కెరీర్ పరంగా దూసుకెళ్తున్న కియారా.. పర్సనల్ లైఫ్ లో కూడా బాగా రిచ్ గా మెయిటేన్ చేస్తుంది. కాస్ట్లీ ఐటమ్స్ కొనడానికి వెనకాడదు. గతంలో కియారా కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కియారాకు కార్లు అంటే విపరీతమైన క్రేజ్. నచ్చిన కారును ఇట్టే కొనేస్తుంది. ఇప్పటికే ఆమె దగ్గర బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెజ్ బెంజ్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ 530డీ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు వీటి జాబితాలో ఆడి ఏ8 ఎల్ కూడా చేరింది. ఆడి ఈ మోడల్‌ను గత ఏడాది భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ కారు ధర 1.56 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో.. టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న కియారా అద్వాని కోసం స్టార్ హీరోలు ఎదురు చూస్తుంటారు. తమ సినిమాల్లో ఒప్పించడానికి పోటీ పడుతుంటారు. కాని సినిమాల విషయంలో ఆలోచించి అడుగులు వేస్తున్న కియారా.. సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. తన ఇమేజ్ ను పెంచుకుంటూ..రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ పోతోంది. దీపం ఉండగాన్నే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సూత్రాన్ని బాగా ఫాలో అవుతుంది కియారా. హీరోయిన్లకు కెరీర్ స్పాన్ తక్కువ అందుకే ఇప్పుడే గట్టిగా సంపాదించుకుంటుంది. ప్రస్తుంతం సినిమాకు 5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుంది కియారా. రామ్ చరణ్ - శంకర్ మూవీకి 5 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్ ధోనీ, కబీర్ సింగ్, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ‘భరత్ అనే నేను’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టినా.. ఆతరువాత వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ అయ్యింది. ఇక రీసెంట్ గా శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా నటించే చాన్స్ కొట్టేసింది.
Also Read : Allu Arjun Pushpa : హృదయాలు గెలుచుకుంటామంటున్న బన్ని.. తగ్గేదే లే