Bigg Boss Telugu 5: విజేత ఎవరో తేల్చి చెప్పేసిన కృష్ణంరాజు సతీమణి.. ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్ అతడికే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 16, 2021, 01:48 PM IST
Bigg Boss Telugu 5: విజేత ఎవరో తేల్చి చెప్పేసిన కృష్ణంరాజు సతీమణి.. ప్రభాస్ ఫ్యామిలీ సపోర్ట్ అతడికే

సారాంశం

కొన్ని నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన  Bigg Boss Telugu 5 త్వరలో ముగియనుంది. గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం అయింది. ఇక విజేత ఎవరో తేలడమే తరువాయి.

కొన్ని నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన  Bigg Boss Telugu 5 త్వరలో ముగియనుంది. గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం అయింది. ఇక విజేత ఎవరో తేలడమే తరువాయి. బిగ్ బాస్ సీజన్ 5లో శ్రీరామ్, సన్నీ, సిరి, షణ్ముఖ్, మానస్ ఫైనల్స్ కి చేరిన టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. 

శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ లలో ఒకరు విజేతగా నిలుస్తారనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ముఖ్యంగా అభిమానుల నుంచి సన్నీ, శ్రీరామ్ లకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. Sreeram కూల్ యాటిట్యూడ్ తో హృదయాలు దోచుకుంటున్నాడు. ఇక సన్నీ అగ్రెసివ్ గా ఉంటున్నప్పటికీ అది అవసరమైనప్పుడు మాత్రమే. మిగిలిన సమయాల్లో సన్నీ ప్రేక్షకులని బాగా అలరిస్తున్నాడు. 

అభిమానుల నుంచి సోషల్ మీడియాలో సన్నీకి బాగా మద్దతు లభిస్తోంది. కానీ సెలెబ్రిటీలలో మాత్రం శ్రీరామ్ క్రేజీగా మారుతున్నాడు. ఇప్పటికే శ్రీరామ్ కి సోనూసూద్‌, సజ్జనార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ లాంటి ప్రముఖులు మద్దతు తెలిపారు. తాజాగా శ్రీరామ్ కి మరో సెలెబ్రిటీ సపోర్ట్ లభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఫ్యామిలీ మొత్తం శ్రీరామ్ కి సపోర్ట్ చేస్తున్నారనే చెప్పాలి. 

శ్రీరామ్ కి మద్దతు తెలుపుతూ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ్ కి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె సోషల్ మీడియా వేదికగా కోరారు. 

 

'హాయ్ శ్రీరామ్..రోజూ బిగ్‌బాస్‌ షో చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్‌ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణంగా నిలిచావు. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా నువ్వే గెలవాలని మా ఫ్యామిలీ తరుపున కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.. బిగ్ బాస్ విజేతవి నువ్వే. ఆల్ ది బెస్ట్' అంటూ శ్యామల దేవి వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

స్వయంగా Prabhas పెద్దమ్మ శ్రీరామ్ కి మద్దతు తెలిపిందంటే దాదాపుగా ప్రభాస్ అభిమానుల మద్దతు కూడా అతడికి లభించినట్లే. శ్రీరామ్ విజేతగా నిలుస్తాడా లేదా అనేది అతి త్వరలో తేలిపోనుంది. 

Also Read: Malavika Mohanan: మాళవిక మోహనన్ స్టన్నింగ్ ఫోటోస్.. ఆగలేకపోతున్న మహేష్ ఫ్యాన్స్, కారణం ఇదే

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు