Allu Arjun Pushpa : హృదయాలు గెలుచుకుంటామంటున్న బన్ని.. తగ్గేదే లే

Published : Dec 16, 2021, 01:53 PM ISTUpdated : Dec 16, 2021, 01:55 PM IST
Allu Arjun Pushpa : హృదయాలు గెలుచుకుంటామంటున్న బన్ని.. తగ్గేదే లే

సారాంశం

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు ఆల్ ది బెస్ట్ లు వెల్లువలా వస్తున్నాయి. స్టార్ సెలబ్రిటీలు వరుస పెట్టి బన్నిని, పుష్ప టీమ్ ను విష్ చేస్తున్నారు. అందరికి సమాధానం ఇస్తున్న అల్లు.. మీ హృదయాలు గెలుచుకుంటానంటున్నాడు.   

ఇప్పుడు ఇండస్ట్రీ అంతా పుష్ప ఫీవర్ నడుస్తుంది. ఈసినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది.. తరువాతి సినిమాల పరిస్థితేంటి అనే ఆలోచనలో ఉంది ఇండస్ట్రీ రీసెంట్ గా రిలీజ్ అయిన 'అఖండ' సూపర్ సక్సెస్ తో చాలా వరకూ ఊపిరి పీల్చుకున్నారు మేకర్స్. ఇక పుష్ప కోసం ఎదురు చూస్తున్నారు. అంతే కాదు చాలా మంది సోషల్ మీడియాలో బన్నిని విష్ చేస్తున్నారు. వాటన్నింటికి ఓపిగ్గా రిప్లై ఇస్తున్నాడు బన్నీ. హృదయాలను గెలుచుకుంటామంటున్నాడు. తగ్గేదే లే అంటూ మీసం మెలేస్తున్నాడు ఐకాన్ స్టార్ . 


అల్లు అర్జున్ (Allu Arjun) ను సోషల్ మీడియాలో వరుసగా విష్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా పుష్ప(pushpa ) టీమ్ కు బెస్ట్ విషెష్ చెప్పారు. నిబద్ధతతో పనిచేశారు. చాలా కష్టపడ్డారు మంచి ఫలితం దక్కాలి అని కోరుకున్నారు. మెగా పోస్ట్ కు దిల్ ఖుష్ అయ్యాడు ఐకాన్ స్టార్.. వెంటనే రిప్లై ఇచ్చాడు. నన్ను.. పుష్ప టీమ్ ను విష్ చేసినందుకు.. మా కష్టాన్ని గుర్తించి.. అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపాడు బన్ని. తప్పకుండా ఈ సినిమాతో మీ హృదయాన్ని తాకుతామంటూ మాటిచ్చాడు అల్లు. 

పుష్ప(Puspha) సినిమాకు ఆల్ ది బెస్ట్ చెపుతూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'పుష్ప' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని విజయ్ అన్నాడు. ట్రైలర్, పాటలు, విజువల్స్, పర్ఫామెన్స్ అంతా మాస్ అని కితాబునిచ్చాడు. ఇదొక నెక్ట్స్ లెవెల్ తెలుగు సినిమా అని చెప్పాడు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించాడు. అల్లు అర్జున్ అన్న, రష్మిక, సుక్కు సార్ ప్రేమను పంపుతున్నానని చెప్పాడు. విజయ్ దేవరకొండ ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. 'మీ ప్రేమకు ధన్యవాదాలు మై బ్రదర్'  మీ హృదయాలను గెలుచుకుంటామని... శుక్రవారం అందరి రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నామని... 'తగ్గేదే లే' అంటూ ట్వీట్ చేశారు. 


.ఇంకా చాలా మంది సెలబ్రెటీలు బన్నిని సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా చలామంది స్టార్స్ పుష్ప మూవీటీమ్ ను అల్లు అర్జున్ కు బెస్ట్ విశేష్ చెప్పారు. వారందరికి ఓపిగ్గా సమాధానం చెపుతూ.. అందరికి పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలిపారు బన్ని. 


 ఈనెల 17న పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో 'పుష్ప' విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించింది. సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. 

Also Read : Radhe Shyam Song : రాధేశ్యామ్ నుంచి మూడో పాట.. సంచారిగా ప్రభాస్.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 11: పార్కులో విశ్వతో అమూల్య, చూసేసిన రామరాజు పెద్దకొడుకు
Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు