
ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు డాడీతో ఎలాగైనా హోలీ ఆడించాలి అంటుంది ఖుషి. నీకోసం నేను కచ్చితంగా ఆ పని చేస్తాను నాది గ్యారెంటీ అంటుంది వేద. అంతలోనే అక్కడికి తనమీద ఎవరు రంగులు పోయకుండా జాగ్రత్త పడుతూ వస్తూ ఉంటాడు యష్. విన్నీ తనమీద కలర్స్ వేయబోతే వద్దు అంటాడు. వేదని చూసి చిన్న పిల్లలాగా ఏంటా రంగులు, అసలు నువ్వు ఎలా డాక్టర్ అయ్యావు.
అయినా ఎలర్జీ వస్తే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను మొదటి నుంచి కలర్స్ ని అవాయిడ్ చేస్తాను అంటూ చిరాకు పడతాడు. వసంత్ తనమీద కలర్స్ వేయటానికి ట్రై చేయబోతే వద్దని వారిస్తాడు యష్. నీ ప్రాబ్లం ఏంటి ఇవి కేవలం కలర్సె కదా అంటాడు విన్ని. నాకు ఇష్టం లేదు నన్ను వదిలేయండి అంటాడు యష్. మన ఖుషి కోసం ఈ ఒక్క రోజు ఆడండి అంటుంది వేద.
నువ్వు నోరు ముయ్యి నాకు కోపం తెప్పించొద్దు అంటూ వేద మీద కేకలేసి, నేను మీకు లాగా పని పాట లేని వాడిని కాదు నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది నేను చాలా బిజీ అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ నా దారి రహదారి డోంట్ కమ్ ఇన్ మై వే అని డైలాగ్ వేస్తాడు. అవునా అన్నట్టుగా చూస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరు. మరోవైపు వేద మీద కలర్ వేయటానికి ప్రయత్నిస్తుంది ఖుషి.
వేద వెళ్లి యష్ వెనకాల దాక్కుంటుంది. మీరు అడ్డు తప్పుకోండి డాడీ నేను మమ్మీని ఈరోజు రంగులతో ముంచేస్తాను అంటుంది ఖుషి. నీ ముద్దుల కూతురే కదా కొట్టించుకోవచ్చు కదా అయినా ఇప్పటివరకు బాగానే ఆడావు కదా అంటాడు యష్. మీరే ఆడొద్దు అని చెప్పారు కదా ఎలర్జీ అది, ఇది అన్నారు కదా అందుకే మానేశాను అంటుంది వేద.
తను చిన్న పిల్ల నువ్వు తన మీద కొట్టొచ్చు కానీ తను నీ మీద కొట్టకూడదా అంటూ వేదని పట్టుకుంటాడు యష్. యష్ చేతుల్లో ఉన్న వేద,ఖుషి కి సెగ చేస్తుంది. అర్థం చేసుకున్న ఖుషి ఓకే అంటూ సైగ చేస్తుంది. కరెక్టుగా ఖుషి కొట్టే టైం కి వేద పక్కకు తప్పుకుంటుంది. కలర్స్ యష్ మీద పడిపోతాయి. ప్లాన్ సక్సెస్ అయ్యింది అన్నట్లుగా అందరూ నవ్వుతారు వాళ్లు కూడా యష్ మీద కలర్స్ వేస్తారు.
సారీ డాడీ మమ్మీ మీద కొట్టబోతే మీ మీద పడ్డాయి అంటుంది ఖుషి. కొట్టింది ఎవరు నా కూతురు కదా ఏం పర్వాలేదులే అంటాడు యష్. మొత్తానికి అనుకున్నది సాధించావు అంటూ వేదని మెచ్చుకుంటుంది. విన్నీ వాళ్లందరూ కూడా మొత్తానికి యష్ చేత హోలీ ఆడించావు అని అప్రిషియేట్ చేస్తారు. ఇదంతా నీ ప్లాన్ అనమాట అంటాడు యష్.
అదేం లేదండి ఏదో ఖుషి సంతోషం కోసం అంటూ ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది వేద. అవునా అయితే నేను కూడా ఖుషి ఆనందం కోసం ఒక పని చేస్తాను అంటూ కలర్స్ తీసుకొని వేద మీద వేయటానికి ప్రయత్నిస్తాడు కానీ వేద దొరక్కుండా పరిగెడుతుంది. ఆమె వెనకే పరిగెడుతాడు యష్. అదే సమయంలో వేద పడిపోబోతే పట్టుకొని నీకు తోడుగా నేనుంటాను అనుకుంటాడు.
మీకు నీడగా నేనుంటాను, మీకు నచ్చే మంచి భార్యను నేనవుతాను అనుకుంటుంది వేద. నువ్వు ఖుషి కి అమ్మవి మాత్రమే కాదు నాకు భార్యవి కూడా, నీకు నా మీద హక్కు ఉంది మనసులు ముడిపడ్డ మూడుముళ్ల బంధం మనది అనుకుంటాడు యష్. ఏడు అడుగుల బంధం మనది ఎన్నెన్నో జన్మల బంధం మనది అనుకుంటుంది వేద. మరోవైపు చిత్ర వాళ్ళ దగ్గరికి వస్తారు సుహాసిని దంపతులు.
కాబోయే దంపతులకి అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ అంటుంది సుహాసిని. నాకు ఒక డౌటు మనం ఆడ పెళ్లి వాళ్ళమా, మగ పెళ్లి వాళ్ళమా అంటాడు సుహాసిని భర్త. కాసేపు చిత్ర తరపున కాసేపు వసంత్ తరపున అంటుంది సుహాసిని. మరి నేనెవరి తరపు అనుకుంటూ అక్కడికి వస్తుంది ఖుషి. నువ్వే పెళ్లి పెద్దవి ఇద్దరి తరపున ఉండి పెళ్లి జరిపించు అంటారు చిత్ర, వసంత్.
అలా అందరూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే అక్కడికి రివాల్వర్ తో వస్తుంది మాళవిక. ఇది ఎవరు గమనించరు. మా అక్క బావని ఎంత నైస్ గా మెస్మరైజ్ చేసిందో చూసావా అది మా అక్క అంటే, అది మా అగ్రహారం స్టైల్ అంటే అంటుంది చిత్ర. అందుకే కదా నీ అనుగ్రహం కోసం తహతహలాడుతున్నాను అంటాడు వసంత్. కలర్స్ తో పాటు కిస్ లు కూడా స్ప్రే చేయచ్చు కదా అంటాడు.
అంతలోనే మాళవిక ని గమనించి ఆమె దగ్గరికి కోపంగా వెళ్తాడు వసంత్. చేతిలో ఉన్న రివాల్వర్ చూసి కంగారు పడుతుంది వేద. తరువాయి భాగంలో గెట్ అవుట్ అంటూ మాళవికని నెట్టేస్తాడు వసంత్. భర్త ఉండి లేని దానిని అయ్యాను, బిడ్డలు ఉండి కూడా గొడ్రాలిని అయ్యాను. కానీ నాకు మాత్రం ఒకే ఒక మార్గం ఉంది నా చేతిలో నేనే చస్తాను అంటూ గన్ ని తనకే గురి పెట్టుకుంటుంది మాళవిక.