
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండు దశాబ్దాల కెరీర్లో ఒక్కసారి మాత్రమే సంక్రాంతికి సినిమా విడుదల చేశారు. ఆయన మూడవ చిత్రం వర్షం 2004లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చిరంజీవి, బాలయ్యలను కూడా వెనక్కి నెట్టి ప్రభాస్ సంక్రాంతి విన్నర్ అయ్యాడు. అంజి ప్లాప్ కాగా, లక్ష్మీ నరసింహ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ భారీ హిట్ గా వర్షం రికార్డులకు ఎక్కింది . మళ్ళీ ప్రభాస్ సంక్రాంతికి రాలేకయారు. ఆయనకు సెట్ కాలేదు.
కాగా రాధే శ్యామ్, ఆదిపురుష్ సంక్రాంతికి విడుదల కావల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. రాధే శ్యామ్ ని కరోనా ఆంక్షలు దెబ్బతీశాయి. 2022 జనవరి నాటికి దేశంలో ఇంకా కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్స్ లో యాభై శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. ఈ క్రమంలో రాధే శ్యామ్ సమ్మర్ కి షిఫ్ట్ చేశారు. అది సినిమాకు బాగా మైనస్ అయ్యింది. అప్ కమింగ్ మూవీ ఆదిపురుష్ కి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. 2023 సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. ఆదిపురుష్ టీజర్ వివాదాస్పదం కాగా దర్శకుడు ఓమ్ రౌత్ మెరుగులు దిద్దుతున్నాడని సమాచారం.
అందరికంటే ముందు ఆదిపురుష్ టీమ్... 2023 సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకుంది. అనూహ్యంగా ఆరు నెలలు వెనక్కిపోయింది. ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ప్రాజెక్టు కే విషయంలో కూడా రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల సీన్ రిపీట్ అయ్యిందంటున్నారు. నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతికి విడుదలయ్యే సూచనలు లేవట. ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్న అమితాబ్ కి ప్రమాదం జరిగింది. ఆయన గాయాల నుండి కోలుకునేందుకు సమయం పట్టేలా ఉంది.
దీంతో ప్రాజెక్ట్ కే షూట్ డిలే కానుందట. చేసేది లేక సంక్రాంతి నుండి సమ్మర్ కి ప్రాజెక్ట్ కే షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. చెప్పినట్లు 2024 జనవరి 12న ప్రాజెక్ట్ కే విడుదల కావడం కష్టం అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచే అంశమే అని చెప్పొచ్చు. నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్. దిశా పటాని సైతం నటిస్తున్నారు.