బాలకృష్ణను గట్టిగా పట్టుకున్న బామ్మ, వదలనంటూ మారాం చేసిన బాలయ్య అభిమాని

Published : Mar 09, 2023, 09:47 AM ISTUpdated : Mar 09, 2023, 10:57 AM IST
బాలకృష్ణను గట్టిగా పట్టుకున్న బామ్మ, వదలనంటూ మారాం చేసిన బాలయ్య అభిమాని

సారాంశం

అన్ని రంగాలకంటే.. సినిమా రంగంలో  తారలంటేనే జనాల్లో క్రేజ్ గట్టిగా ఉంటుంది. సినిమా తారలు కనిపిస్తే.. ఒళ్లు తెలియకుండా ఊగిపోతుంటారు ఫ్యాన్స్. వయస్సుతో సంబంధం లేకుండా ఉరకలు పెడుతుంటారు. రీసెంట్ గా ఓ వయసు మళ్ళిన  బామ్మ కూడా బాలయ్యపై తన అభిమానాన్ని ఎలా చూపించిందో చూడండి. 

అభిమానులు చేసే పనులకు సినీ తారలు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది. అదే బాలయ్య లాంటివారు అయితే విసిగించే కుర్ర అభిమానులకు చెంపదెబ్బలతో బదులు చెపుతుంటారు. ఫ్యాన్స్ కూడా బాలయ్యతో తన్నులు తినడం అదృష్టంగా భావిస్తుంటారు. అయితే అభిమానులు వయస్సులో ఉన్నవారే కానవసరం లేదు.. వయస్సు మళ్ళిన పెద్దవాళ్లకు కూడా హీరోలు అంటే అభిమానం ఉంటుంది కదా. అలానే నందమూరి నటసింహం బాలయ్యపై తన అభిమానాన్ని చాటుకుంది ఓ పెద్దావిడ.ఆయన్ను కాస్త ఇబ్బంది కూడా పెట్టింది. 

బాలయ్యపై ఫ్యాన్స్ అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మాస్ అభిమానుల్లో బాలకృష్ణకు గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఇక ఇది అలా ఉంచితే.. బుధవారం బాలయ్య విజయవాడలో సందడి చేశారు. అఖండ భామ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి ఓ జ్యువ్వెల్లరీ షాపుకు   ప్రారంభోత్సవం చేశారు. అంతే కాదు ఈ బ్రాండ్  జ్యూవెలరీకి  అంబాసిడర్లుగా కూడా ప్రగ్యా- బాలయ్య వ్యవహరిస్తున్నారు. అయితే  ఆ సంస్థ కొత్తగా  విజయవాడలో మొదటి షోరూమ్ ను స్టార్ట్ చేశారు. ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలకు బాలయ్యతో పాటు ప్రగ్యా కూడా హాజరయ్యింది. 

 

ఇక బాలకృష్ణ వస్తున్నారంటే.. ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో తెలిసిందే కదా..? బాలయ్య- ప్రగ్యా జైస్వాల్ ను చూసేందుకు ఫ్యాన్స్ తండోపతండాలుగా పోటెత్తారు.ఇక ఈ కార్యక్రమం తరువాత  అభిమానులను ఉద్దేశించి బాలయ్య కొద్ది సేపు మాట్లాడారు. అయితే సరిగ్గా.. అప్పుడు అక్కడ ఓ  ఆసక్తికర ఘటన జరిగింది. బాలయ్య మాట్లాడే సమయంలో ఆయన దగ్గరకు ఓ  బామ్మ వచ్చింది. అసలు బాలకృష్ణ దగ్గరకు రావడానికి అంతా భయపడతారు. అటువంటిది  బాలయ్యను దగ్గర నుంచి చూడటమే కాకుండా ఆయన మాట్లాడుతుంటే గట్టిగా పట్టుకుంది. బాలయ్య కూడా ఆవిడ అభిమానం చూసి ఆప్యాయంగా భుజం మీద చేయి వేశారు. 

బాలయ్య దగ్గరకు రావడం అంటేనే గొప్ప విషయం.. అటువంటిది బామ్మ ఏంగా కౌంగిలించుకుంది.  వెంటనే సెక్యూరిటీ వారు ఆమెని కిందకు వెళ్లమని కోరగా.. ఆమె బాలయ్యను పట్టుకుని వదలను అన్నట్లు తల ఊపుతూ కాసేపు మారాం చేసింది.ప్లీజ్ బామ్మగారు అంటూ వారు బతిమాలడంతో సరేలే అన్నట్టుగా ఇబ్బంది పడుతూ.. బాలకృష్ణను వదిలేసి కిందకు వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానులు ఈ వీడయోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బామ్మను దగ్గరకు తీసుకున్న బాలయ్య మంచితనాన్ని  ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌