పెళ్లి పీటల వరకు వెళ్లారు, రెండుసార్లు ఎదురుదెబ్బ.. 40 ఏళ్ళ వయసులో హీరోయిన్ తో వివాహానికి స్టార్ హీరో రెడీ ?

By tirumala AN  |  First Published Sep 29, 2024, 12:55 PM IST

తమిళ హీరో శింబు గురించి పరిచయం అవసరం లేదు. రొమాంటిక్ లవ్ స్టోరీలతో స్టైలిష్ హీరోగా శింబు గుర్తింపు తెచుకున్నాడు. మన్మధ, వల్లభ లాంటి చిత్రాలు శింబుకి తెలుగులో కూడా గుర్తింపు తీసుకువచ్చాయి.


తమిళ హీరో శింబు గురించి పరిచయం అవసరం లేదు. రొమాంటిక్ లవ్ స్టోరీలతో స్టైలిష్ హీరోగా శింబు గుర్తింపు తెచుకున్నాడు. మన్మధ, వల్లభ లాంటి చిత్రాలు శింబుకి తెలుగులో కూడా గుర్తింపు తీసుకువచ్చాయి. ఆ తర్వాత శింబు కొనసాగించలేదు. మూడేళ్ళ క్రితం వచ్చిన మానాడు చిత్రంతో శింబు మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టాడు. 

ఇంకా పెళ్లి జోలికి వెళ్లని శింబు 

శింబు వయసు ప్రస్తుతం 41 ఏళ్ళు కానీ ఇంతవరకు శింబు పెళ్లి జోలికి వెళ్ళలేదు. కానీ ఈ రొమాంటిక్ హీరోకి ప్రేమ వ్యవహారాలు మాత్రం మెండుగా ఉన్నాయి. ప్రేమలో డీప్ గా మునిగిపోయి దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. శింబు లవ్ ఎఫైర్స్ బహిరంగ రహస్యమే అని చెప్పొచ్చు. ముందుగా నయనతారని శింబు ప్రేమించారు. వల్లభ చిత్రంలో వీరిద్దరి రొమాన్స్ అయితే నెవర్ బిఫోర్. ఆ చిత్రంలో రొమాన్స్, ముద్దు సన్నివేశాల వల్ల నయనతార ఆఫ్ స్క్రీన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 

నయనతార, హన్సికతో శింబు లవ్ ఎఫైర్ 

Latest Videos

మీడియా పదే పదే ఆ సన్నివేశాల గురించి అడగడంతో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని బదులిచ్చింది. శింబు, నయన్ కొంతకాలం రిలేషన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ వీళ్లిద్దరి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. కానీ ఊహించని విధంగా ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత శింబు, హన్సిక మధ్య ప్రేమ చిగురించింది. హన్సిక తో కూడా వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది. శింబు కుటుంబ సభ్యులు కూడా పెళ్ళికి అంగీకరించారు. కానీ చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. హన్సిక, శింబు విడిపోయారు. ఇది కూడా శింబు ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూసే. 

అప్పటి నుంచి శింబు ఒంటరిగా ఉంటున్నాడు. అయితే మరోసారి శింబు పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. 41 ఏళ్ళ వయసులో శింబు పెళ్లికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.శింబు పెళ్లి చేసుకోబోయేది ఒక క్రేజీ హీరోయిన్ ని అంటూ ప్రచారం జరుగుతోంది. శింబు పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇది కొత్త కాదు.  శింబు పెళ్లి గురించి గతంలో కూడా ఊహాగానాలు వినిపించాయి. కోలీవుడ్ కి చెందిన ఒక ఫైనాన్షియర్ కుమార్తెని శింబు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అవి రూమర్స్ అని తేలిపోయాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు నిజం అవుతాయి అని కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం.

నిధి అగర్వాల్ తో త్వరలో పెళ్లి ?

ఆ రూమర్స్ ఏంటంటే శింబు, హీరోయిన్ నిధి అగర్వాల్ రిలేషన్ లో ఉన్నారట. వీళ్లిద్దరి రెండేళ్ల క్రితం ఈశ్వరన్ అనే చిత్రంలో జంటగా నటించారు. అప్పటి నుంచి శింబు, నిధి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ ని శింబు తన జీవిత భాగస్వామి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. అయితే ఈ  వార్తలు కూడా అధికారికంగా వెలువడలేదు. శింబు పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ మాత్రమే. ఈ రూమర్స్ అయినా నిజం కావాలి అని శింబు అభిమానులు కోరుకుంటున్నారు. 

శింబు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. తమిళంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన టి రాజేందర్, నటి ఉష రాజేందర్ కొడుకే శింబు. శింబుకి ఒక తమ్ముడు ఉన్నాడు. అదే విధంగా సోదరి కూడా ఉంది. శింబు తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే విధంగా శింబు సోదరికి కూడా పెళ్లి జరిగింది. శింబు మాత్రం ఇంకా పెళ్లి జోలికి వెళ్ళలేదు. 

శింబు మంచి సింగర్ 

ఇదిలా ఉండగా శింబు మంచి సింగర్ కూడా. గతంలో శింబు ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో డిమాండ్ గర్ల్ అనే సాంగ్ పాడాడు. తమిళంలో కూడా అనేక పాటలు పాడారు. తాజాగా శింబు పవన్ కళ్యాణ్ ఓజి చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ని పాడారు. పవన్ కళ్యాణ్ పై గౌరవంతో ఈ పాటకి శింబు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం శింబు పాడిన పాట కోసం ఎదురుచూస్తున్నారు. 

click me!