కృష్ణకు నమ్రతను కోడలిగా తెచ్చుకోవడం ఇష్టం లేదనే ఓ వాదన ఉంది. ఈ క్రమంలో కోడలు మహేష్ భార్య నమ్రతపై కృష్ణకు ఉన్న అభిప్రాయం ఏమిటీ?
బాలీవుడ్ భామ నమ్రతతో మహేష్ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అప్పట్లో ఈ రహస్య వివాహం ఓ సెన్సేషన్. మీడియాకు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇక నమ్రతను మహేష్ బాబు పెళ్లి చేసుకోవడాన్ని కృష్ణ తిరస్కరించారు. ఆయనకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగిందనే పుకార్లు ఉన్నాయి. ఈ క్రమంలో నమ్రతను ఉద్దేశిస్తూ ఓ ఇంటర్వ్యూలో కృష్ణ, విజయనిర్మల ఆసక్తికర కామెంట్స్ చేశారు.
1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత శిరోద్కర్ 1998లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. బాలీవుడ్ హీరోయిన్ గా పలువురు స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. నమ్రత తల్లి కూడా నటి. అక్క శిల్పా శిరోద్కర్ సైతం హీరోయిన్ గా రాణించింది. శిల్పా శిరోద్కర్ తెలుగు లో బ్రహ్మ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. హిందీ చిత్రాల్లో నటిస్తున్న నమ్రతకు చిరంజీవి సరసన అంజి మూవీలో ఆఫర్ వచ్చింది.
అంజి సినిమా డిలే అయ్యింది. ఈ లోపు మహేష్ బాబుకు జంటగా నటించిన వంశీ షూటింగ్ పూర్తి కావడంతో పాటు, అంజి కంటె ముందు రిలీజ్ అయ్యింది. దర్శకుడు బీ. గోపాల్ తెరకెక్కించిన వంశీ లో మహేష్-నమ్రత హీరో హీరోయిన్ గా నటించారు. అప్పుడే వీరి ప్రేమ కథ మొదలైంది.
ప్రేమలో పడిన వెంటనే మహేష్ బాబు-నమ్రత వివాహం చేసుకోలేదు. ఒకరిపై మరొకరికి గట్టి అవగాహన కుదిరాకే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2000లో మొదలైన వీరి ప్రేమ కహానీ ఐదేళ్ల పాటు రహస్యంగా సాగింది. 2005లో మహేష్ బాబుని నమ్రత వివాహం చేసుకుంది.
ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మీడియాకు సమాచారం లేదు. ఒక విధంగా దీన్ని సీక్రెట్ మ్యారేజ్ అనుకోవచ్చు. హిందీ హీరోయిన్ ని కోడలిగా తెచ్చుకోవడానికి కృష్ణ అసలు ఇష్టపడలేదట. మహేష్ బాబు, మంజుల బలవంతంగా కృష్ణను ఒప్పించారనే వాదన ఉంది.
నమ్రతను అయిష్టంగానే కృష్ణ కోడలిగా తెచ్చుకున్నాడనే పుకార్ల నేపథ్యంలో... ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. మహేష్ బాబు పెళ్ళినాటి సంగతులు. అప్పుడు ఎదురైన పరిస్థితులు బయటపెట్టాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న కృష్ణ, విజయ నిర్మల ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మహేష్ తో పెళ్ళికి నమ్రత అమ్మమ్మ అడ్డుపడిందట. అందుకు కారణం ఏమిటంటే... ఆమెకు క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ అట. పెళ్లి కుదిరాక కూడా... ఎక్కడ చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అంటూ... పట్టింపులకు పోయిందట. ఈ కామెంట్స్ విజయనిర్మల చేశారు.
అయితే నమ్రతను పెళ్లాడాక.. మహేష్ బాబు హ్యాపీ అని కృష్ణ అన్నారు. నమ్రతకు ఫైనాన్సియల్ మేటర్స్, అడ్వర్టైస్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ విషయాలపై అవగాహన ఉంది. అవన్నీ ఇప్పుడు నమ్రత చూసుకుంటుంది. మహేష్ బాబుకు ఆ ఒత్తిడి తగ్గింది. మహేష్ కేవలం నటనపై దృష్ఠి పెట్టడానికి అవకాశం ఏర్పడింది. నమ్రత చాలా తెలివిగల అమ్మాయి, అన్నారు.
అలాగే నమ్రత తెలుగు నేర్చుకుందట. ఇంట్లో కృష్ణతో తెలుగులోనే ఆమె మాట్లాడతారట. నమ్రతపై కృష్ణకు పూర్తి పాజిటివ్ ఒపీనియన్ ఉందని ఆయన కామెంట్స్ తో క్లారిటీ వచ్చింది. ఇక నమ్రతను కృష్ణ కోడలిగా అంగీకరించలేదనే పుకార్లకు చెక్ పడింది.
అల్ట్రా మోడరన్ సొసైటీలో బ్రతికిన నమ్రత వివాహం అనంతరం పక్కా గృహిణిగా మారిపోయారు. మొదటి సంతానంగా గౌతమ్ కి జన్మనిచ్చింది. అనంతరం సితార జన్మించింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు వారి పోషణ బాధ్యత తీసుకుంది. అనంతరం మహేష్ బాబుకు సలహాదారుగా మారిపోయింది.
మహేష్ బాబు సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా మారుస్తుంది. మహేష్ బాబు ఎండార్స్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రోగ్రామ్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మహేష్ బాబుకు ఓ నిర్మాణ సంస్థతో పాటు, ఏఎంబి సినిమాస్, ఆన్లైన్ గార్మెంట్ బ్రాండ్ ఉంది.
మహేష్ ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏడాది పలుమార్లు విదేశీ టూర్లకు వెళతారు. ఫ్రాన్స్, దుబాయ్, యూఎస్ మహేష్ ఫ్యామిలీకి ఇష్టమైన ప్రదేశాలు. ఫ్యామిలీ కోసం తన ప్రొఫెషన్ వదిలేసిన నమ్రత అంటే కృష్ణకు ఇష్టం.
2022లో మహేష్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏడాది ఆరంభంలో అన్నయ్య రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశాడు. అనంతరం కొద్ది రోజులకు తల్లి ఇందిరా దేవి కన్నుమూసింది. నవంబర్ 15న తేదీన కృష్ణ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మహేష్ బాబు ఫ్యామిలీకి కృష్ణకు ఘనంగా వీడ్కోలు పలికారు.