`మెగా154` అప్‌డేట్‌ః పూనకాలు లోడింగ్‌.. ఇది మెగా ఫెస్టివల్‌

Published : Aug 22, 2021, 04:52 PM IST
`మెగా154` అప్‌డేట్‌ః పూనకాలు లోడింగ్‌.. ఇది మెగా ఫెస్టివల్‌

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి సందర్భంగా ఒకేసారి నాలుగు సినిమాల అప్‌డేట్లతో, కొత్త పోస్టర్లు, కొత్త లుక్స్, కొత్త జోనర్‌ సినిమాలతో మెగా అభిమానులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్టాల్లో రాఖీ పండుగ పక్కకెళ్లి మెగా పండుగలా ఉంది. మెగా అభిమానులు ఆ రేంజ్‌లో సంబరాలు చేసుకుంటున్నారు.

నేడు మెగాస్టార్‌ అభిమానులకిది ఎప్పుడూ చూడని పండగ. ఓ వైపు చిరంజీవి బర్త్ డే, మరోవైపు రాఖీ పండుగ. ఈరెండు పండుగలతోనే అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ పండుగలనే తట్టుకోలేకపోతున్నారు. కానీ నేడు ఆదివారం ఒకేసారి నాలుగైదు పండగలు కలిసొచ్చినట్టుంది మెగా ఫ్యాన్స్ కి. అందుకే 2021ఆగస్ట్ 22 మెగా అభిమానులకు జీవితంలో మర్చిపోలేని రోజు కానుంది. ఎప్పుడూ చూడని రోజు కాబోతుంది.  మెగా ఫెస్టివల్‌ ఈ రేంజ్‌లో ఉంటుందని ఎప్పుడూ ఊహించని రోజుగా నిలుస్తుంది. అవును.. ఇది మెగా ఫెస్టివల్‌. 

మెగాస్టార్‌ చిరంజీవి సందర్భంగా ఒకేసారి నాలుగు సినిమాల అప్‌డేట్లతో, కొత్త పోస్టర్లు, కొత్త లుక్స్, కొత్త జోనర్‌ సినిమాలతో మెగా అభిమానులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్టాల్లో రాఖీ పండుగ పక్కకెళ్లి మెగా పండుగలా ఉంది. మెగా అభిమానులు ఆ రేంజ్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే `ఆచార్య` కొత్త పోస్టర్‌, రామ్‌ చరణ్‌ గిఫ్ట్ వచ్చాయి. అలాగే మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న `గాడ్‌ఫాదర్‌` టైటిల్‌, ఫస్ట్ లుక్‌ వచ్చింది. 

వీటితోపాటు మెహర్‌రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్‌ని ప్రకటించారు. దీనికి `భోళా శంకర్‌` అనే టైటిల్‌ని ఖరారు చేయడంతోపాటు అన్నాచెల్లి అనుబంధాన్ని చాటుతూ ఓ మోషన్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో చిరుకి చెల్లిగా కీర్తిసురేష్‌ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. చిరుకి కీర్తి రాఖీ కడుతున్నట్టుగా పోస్టర్‌ రిలీజ్‌ చేసి మెగా ఫ్యాన్స్ ని హ్యాపీ చేశారు. మరోవైపు సెలబ్రిటీలు వరుసగా బర్త్ డే విషెస్‌లు చేస్తున్నారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

ఈ క్రమంలో తాజాగా మరో అప్‌డేట్‌ వచ్చింది. బాబీ(కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందుతున్న `మెగా154` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. శనివారం ప్రీ లుక్‌ రిలీజ్‌ చేయగా, నేడు `హ్యాపీ బర్త్ డే మెగాస్టార్‌`అని, పూనకాలు లోడింగ్‌ అంటూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో సముద్రంలోకి వేటకు వెళ్తున్నట్టుగా ఉన్న చిరంజీవి లుక్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. `ముఠామేస్త్రీ` లుక్‌ని పోలి ఉందని అంటున్నా.. పోస్టర్‌ చూస్తుంటే మాత్రం చిరు నెక్ట్స్ లెవల్‌ ని చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ పోస్టర్‌లో `పూనకాలు లోడింగ్‌` అన్నట్టుగానే చూడబోతే ఇది అభిమానులకు, సాధారణ ఆడియెన్స్ కి సైతం పూనకాలు తెప్పించేలా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ పోస్టర్‌ విడుదల సందర్భంగా యూనిట్‌ చెబుతూ, `మాస్‌ ఆఫ్‌ గాడ్‌ మాంస్టర్‌, బాక్సాఫీసు కా గ్యాంగ్‌స్టర్‌, ఒకే ఒక్కడు మెగాస్టార్‌` అని పేర్కొనడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మెగా అభిమానులకు పర్‌ఫెక్ట్ బర్త్ డే ట్రీట్‌లా ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?