భారీ హిట్ దిశగా 'రాజ రాజ చోర'.. 3 రోజుల కలెక్షన్స్

pratap reddy   | Asianet News
Published : Aug 22, 2021, 04:24 PM IST
భారీ హిట్ దిశగా 'రాజ రాజ చోర'.. 3 రోజుల కలెక్షన్స్

సారాంశం

యువ నటుడు శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర. ఆగష్టు 19న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఫిలిం క్రిటిక్స్ తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది.

యువ నటుడు శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర. ఆగష్టు 19న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఫిలిం క్రిటిక్స్ తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. హాస్యభరితమైన అంశాలతో పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

ప్రస్తుతం సినిమాలని థియేటర్స్ లో రిలీజ్ చేయాలంటేనే నిర్మాతలు భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజ రాజ చోర చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కావడమే కాదు.. అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. 

మూడు రోజుల్లో రాజ రాజ చోర చిత్రం రూ 6 కోట్ల గ్రాస్ సాధించింది. నేడు ఆదివారం కావడంతో వసూళ్లు పెరగనున్నట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

తాజాగా వసూళ్లతో రాజా రాజ చోర చిత్రం బిగ్ హిట్ గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. దొంగ పాత్రలో నటించిన శ్రీ విష్ణు నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీ విష్ణుకి జోడిగా మేఘా ఆకాష్ నటించింది. హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం ఇదే. ఇలాంటి విజయాలు టాలీవుడ్ కు మరికొన్ని దక్కితే.. థియేటర్స్ లో సినిమాల సందడి మళ్ళీ పెరుగుతుంది. 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?