ఎన్టీఆర్ పై ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published : Dec 10, 2018, 02:06 PM IST
ఎన్టీఆర్ పై ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు!

సారాంశం

సీనియర్ నటి ఖుష్బూ.. జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. గతంలో ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించింది ఖుష్బూ. తాజాగా మరోసారి ఆమె జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేసింది. 

సీనియర్ నటి ఖుష్బూ.. జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. గతంలో ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించింది ఖుష్బూ. తాజాగా మరోసారి ఆమె జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు చేసింది. 

ఇప్పుడు సినీరంగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు కదా.. మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరని ప్రశ్నించగా తెలుగులోనా, తమిళంలోనా అని అడిగింది ఖుష్బూ. తెలుగులో అనగానే.. ''నేను జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని.

నాకు తారక్ అంటే పిచ్చి. అతడి సినిమా విడుదలైందంటే చిన్న పిల్లలాగా థియేటర్ కి వెళ్లి విజిల్స్ వేయాలి. చప్పట్లు కొట్టాలి. పేపర్లు చించి విసిరేయాలంతే.. అతడిపై నా అభిమానం ఇలా ఉంటుంది'' అంటూ చెప్పుకొచ్చింది.  'స్టూడెంట్ నెం 1' సినిమా చూసినప్పటి నుండి ఎన్టీఆర్ కి అభిమానిగా మారానని ఖుష్బూ వెల్లడించింది.

జూనియర్ ఎన్టీఆర్ కి ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెలబ్రిటీలు సైతం తారక్ ని అభిమానిస్తుంటారు. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో తారక్ ఒకరు. ఇప్పుడు ఖుష్బూ అతడిని అంతగా అభిమానిస్తున్నానని చెప్పడంతో  ఆయన అభిమానులు సంతోషంతో  మురిసిపోతున్నారు.

ఒక్క రాత్రి గడపడం కోసం ఎవరూ కోట్లు ఖర్చు పెట్టరు.. ఖుష్బూ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?