
టాలీవుడ్ లో ఉన్న కమెడియన్స్ 'ఫ్లయింగ్ కలర్స్' పేరుతో ఓ గ్రూప్ పెట్టుకొని పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్ తో పార్టీను సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ గ్రూప్ లో శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, సత్యం రాజేష్, నందు, ధనరాజ్, వేణు, సత్య, వెన్నెల కిషోర్ ఇలా కొంతమంది ఉన్నారు.
నిన్న కమెడియన్ సత్యం రాజేష్ పార్టీని హోస్ట్ చేశారు. వెన్నెల కిషోర్ బిజీగా ఉండడంతో ఈ పార్టీకి రాలేకపోయారట. దీంతో వెన్నెల కిషోర్ మిస్ అవుతున్నాడనే ఫీలింగ్ రాకుండా.. అతడి కటౌట్ ని సిద్ధం చేశారు.
దాంతో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది గమనించిన వెన్నెల కిషోర్.. నా కటౌట్ మాత్రమే కాదు.. మనసు కూడా అక్కడే ఉందంటూ పోస్ట్ పెట్టాడు. ప్రతిసారి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ పెట్టుకొని పార్టీ చేసుకొనే ఈ గ్రూప్ ఈసారి సూట్ బూట్ తో దర్శనమిచ్చారు. వీరంతా ఇలా కలిసికట్టుగా ఉండడం, పార్టీలు చేసుకోవడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.