
'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..' ఊర మాస్ సాంగే అయినా, సాంగ్ పరమ రొటీన్‌గా వుందనే విమర్శలొచ్చినా, చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' సినిమాపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో అభిమానులు, యూ ట్యూబ్‌లో ఆ పాటకి ఫిదా అయిపోయారని హిట్స్‌ని బట్టి అర్థమవుతోంది. వారం రోజుల్లో 'అమ్మడు..' ఆడియో సాంగ్ 50 లక్షల వ్యూస్‌ని సాధించిన నేపథ్యంలో, 'సుందరి' సాంగ్ ఇంకా ఎక్కువే హిట్స్ సాధిస్తుందనే అంచనాలు అభిమానుల్లో కన్పిస్తున్నాయి.
టీజర్, ఆడియో సింగిల్స్‌తో సినిమాపై అంచనాల్ని మరింత పెంచేస్తున్నారు బాగానే వుంది.. సినిమా ఆడియో విడుదల వేడుక మాటేమిటి.? అసలు అది వుంటుందా.? లేదా.? ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాటేమిటి.? ఈ సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది. త్వరలోనే ఈ సస్పెన్స్‌పై క్లారిటీ ఇవ్వనుందట 'ఖైదీ నెంబర్ 150' సినిమా యూనిట్.