
జనవరి 4న విజయవాడలో `ఖైదీనంబర్ 150` ప్రీరిలీజ్ ఫంక్షన్ అభిమానులు, సినీప్రముఖుల మధ్య గ్రాండ్‌గా జరగనుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ `ఖైదీనంబర్ 150` కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించబోతున్న సందర్భంగా చిత్రనిర్మాత చరణ్ ప్రేక్షకాభిమానులకు క్రిస్మస్, కొత్తసంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
`ఖైదీనంబర్ 150` నుంచి `సుందరి..` సాంగ్ లాంచ్ అయిన సంగతి విదితమే.కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు.