KGF 2: పక్కా ప్లానింగ్‌లో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రాఖీభాయ్‌.. రూట్‌ మ్యాప్‌ ఇదే

Published : Apr 10, 2022, 11:28 AM IST
KGF 2: పక్కా ప్లానింగ్‌లో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రాఖీభాయ్‌.. రూట్‌ మ్యాప్‌ ఇదే

సారాంశం

కేజీఎఫ్‌ 2 సినిమా ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు. పక్కా ప్లానింగ్‌తో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు రాఖీభాయ్‌ యష్‌. తాజాగా ప్రమోషన్‌ రూట్‌ మ్యాప్‌ని రిలీజ్‌ చేశారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆ స్థాయి అంచనాలతో రిలీజ్‌ కాబోతున్న మరో సినిమా `కేజీఎఫ్‌ 2. నాలుగేండ్ల క్రితం వచ్చిన `కేజీఎఫ్‌` చిత్రానికిది రెండో భాగం. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అదే సమయంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా భారీగానే నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` మాదిరిగా ఇండియాలోని ప్రధాన నగరాలను కవర్‌ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పక్కా ప్లానింగ్‌తో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ రోజే నుంచే రాఖీభాయ్‌(కేజీఎఫ్‌లో హీరో పాత్ర పేరు) తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలో ప్రెస్‌మీట్‌ నిర్వహించబోతున్నారు. సాయంత్రం 6.30గంటలకు తిరుపతిలో మీడియా సమావేశంలో పాల్గొని రేపు(సోమవారం) ఉదయం ఎనిమిది గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

అనంతరం సోమవారం ఉదయం 10.30గంటలకు సింహాచంలోని వరహ లక్ష్మీ నరసింహ టెంపుల్‌ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి వైజాగ్‌ వెళ్లి అక్కడ  11.30గంటలకు  మీడియా సమావేశంలో పాల్గొంటారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కి చేరుకుంటారు. సాయంత్రం ఏడుగంటలకు హైదరాబాద్‌లో మీడియా ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు `కేజీఎఫ్‌ 2` టీమ్‌. ఇలా రెండు రోజులపాటు పక్కా ప్లానింగ్‌తో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురు చేయబోతున్నారు. 

`కేజీఎఫ్‌` మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో పార్ట్ పై అందరినలోనూ ఆసక్తి నెలకొంది. `బాహుబలి` మొదటి భాగం ఏవిధంగా సక్సెస్‌ అయి రెండో పార్ట్ పై ఆసక్తిని పెంచిందో, ఇప్పుడు `కేజీఎఫ్‌ 2`పై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. గోల్డ్ మైనింగ్‌లోని తిరుగులేని నాయకుడిగా ఎదిగిన రాఖీ భాయ్‌.. ఆ తర్వాత భారత ప్రభుత్వంతో ఎలా పోరాడాడు, ఆయన లెగసీని, పతనాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో రాఖీ భాయ్‌గా యష్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్‌ దత్‌ గరుడ పాత్రలో, దేశ ప్రధానిగా రవీనా టండన్‌ కనిపించబోతున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..