
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ని `సలార్` టీమ్ నిరాశ పరిచింది. ఎన్నో ఆశలతో ఉన్న అభిమానులను ఒక్క పోస్ట్ తో నిరుత్సాహానికి గురి చేసింది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకరు. `కేజీఎఫ్` ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ చిత్రమిది. మైనింగ్ నేపథ్యంలో అత్యంత హింసాత్మక నాయకుడి పోరాటం ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేడు. జస్ట్ టైటిల్ ఫస్ట్ లుక్, జగపతిబాబు లుక్‌లను మాత్రమే విడుదల చేశారు. ఏడాది పైనే అవుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కొత్త అప్‌డేట్ లేకపోవడంతో అభిమాలను తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఎట్టకేలకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నట్టు వార్తలొచ్చాయి. `కేజీఎఫ్2` సినిమా ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఈ సినిమాలోపాటు `సలార్` ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. సినిమా ఇంటర్వెల్ టైమ్‌లోగానీ, పూర్తయిన తర్వాత గానీ `సలార్` ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు ట్రెండ్ అయ్యాయి.
అయితే తాజాగా దీనిపై `సలార్` యూనిట్ స్పందించింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. `కేజీఎఫ్ 2` సినిమా ఎండింగ్‌లో `సలార్` ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అని వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అవి పూర్తిగా తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. మేకర్స్ రైట్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలిపింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదు. ఇప్పట్లో ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదని తెలుస్తుంది. `కేజీఎఫ్` చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు ప్రభాస్ `ఆదిపురుష్` చిత్రంలో రాముడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రమిది. కృతి సనన్ సీతగా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని శ్రీరామనవమి(నేడు) సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. మరి ఇది కూడా వస్తుందా? లేక డిజప్పాయింట్ చేస్తుందా? అనేది చూడాలి.