Mahesh Babu Tweet : శ్రీరామనవమిన మహేశ్ ను సర్ ప్రైజ్ చేసిన సితార.. మురిసిపోతున్న సూపర్ స్టార్.. ఏం చేసిందంటే.?

Published : Apr 10, 2022, 11:00 AM IST
Mahesh Babu Tweet : శ్రీరామనవమిన మహేశ్ ను సర్ ప్రైజ్ చేసిన సితార.. మురిసిపోతున్న సూపర్ స్టార్.. ఏం చేసిందంటే.?

సారాంశం

శ్రీరామనవమిని పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార గట్టమనేని తండ్రిని ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేసింది. దీంతో మహేశ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఆ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు.

స్టార్ కిడ్ సితార గట్టమనేని (Sitara Gattamaneni) చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ కిడ్ గా సితార నెటిజన్లకు దగ్గరవుతోంది. పలు రీల్స్, డాన్స్ వీడియోస్, కిడ్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తండ్రిని మించి తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంటోంది.  మహేశ్ బాబు (Mahesh Babu) తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలోని పెన్నీ సాంగ్ లో సితార అదిరిపోయేలా స్టెప్పులేసింది. దీంతో తెలుగు ప్రేక్షకులను బిగ్ స్క్రీన్ పై పరిచయం చేసుకోనుంది. మహేశ్ కూతురు తొలిసారి ఇంట్రడ్యూస్ అవుతుడటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. సితార వెస్టర్స్ డ్యాన్స్ తో ఇన్నాళ్లు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరామనవమి (Sri Rama Navami 2022) సందర్భంగా తనలోని మరో స్కిల్ ను బయటపెట్టింది. గత కొద్ది రోజులు సితార క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి (Kuchipudi) నేర్చుకుంటోంది. ఈ రోజు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా తన ప్రతిభన చూపించింది.  సంప్రదాయ దుస్తుల్లో సితార తొలిసారిగా కూచిపూడి నాట్యం చేస్తూ ఆకట్టుకుంది. ఆ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. ‘ఇది నా మొదటి కూచిపూడి నాట్య పఠనం. నా గురువులు అరుణాభిక్షు మరియు మహతీభిక్షుల వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. డీవీఎస్ శాస్త్రి సంగీతం అందించారు.  శ్రీరామ నవమిని పురస్కరించుకుని, శ్రీరాముడి పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అంటూ నోట్ రాసింది.

 

అయితే తొలిసారి తన కూతురు సితార కూచిపూడి నృత్యం చేయడం పట్ల మహేశ్ బాబు మురిసిపోయారు. అదే వీడియో క్టిప్ ను మహేశ్ తన ట్విట్టర్ లో షేర్ చేసి.. అభిమానులతో పంచుకున్నాడు. ‘సితార మొట్టమొదటి సారిగా కూచిపూడి నృత్య పఠనం చాలా సంతోషకరం. ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ప్రదర్శించడం కంటే ఆనందమేమీ లేదు. ఈ శ్లోకం శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నెటిజన్లు కూడా సితార నైపుణ్యానికి ఆశ్చర్యపోతున్నారు. లైక్ లు, కామెంట్లతో తనను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?