
కెజియఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రికార్డుల మీద రికార్డ్ లు సాధించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్‌పై చూసి ఫుల్ ఎంజాయ్ చేసిన ప్రేక్షకుల ఇక బుల్లితెరపై చూసి దిల్ ఖుష్ కాబోతున్నారు.
మరోసారి థ్రిల్ అందించేందుకు రెడీ అవుతోంది కేజీఎఫ్ చాఫ్టర్ 2.. అందరి ఇళ్లలో సందడి చేసేందుకు ముస్తాబైంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల కలెక్షలని కలెక్ట్ చేసింది. ఈ సినిమా వల్ల కన్నడ పరిశ్రమ స్థాయి మరో లెవెల్ కి పెరిగింది. ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా కెజియఫ్ 2 మూవీ సరికొత్త రికార్డులని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది.
కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులను జీ తెలుగు భారీ మొత్తానికి కొనుక్కుంది. ఈ సినిమాను ఆగస్టు 21 ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. అయితే థియేటర్ లో రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా బుల్లితెరపై కూడా రికార్డ్ టిఆర్పీ ని నమోదు చేయాలని చూస్తున్నారు. దానికోసం స్పెషల్ గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు ఛానల్ నిర్వాహకులు. హైదరాబాద్ లో కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమాకు సంబంధించిన 80 అడుగుల బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
ప్రచారం విషయంలో తగ్గేది లేదంటున్నారు.. అయితే ఈ బ్యానర్ చూసిన యశ్ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కన్నడాలో కూడా లేని విధంగా తెలుగులో యష్ కు ఇంత గౌరవం దక్కుతుండటంతో.. అటు కన్నడ నాట నుంచి కూడా యష్ ఫ్యాన్స్ దిల్ కుష్ అవుతున్నారు. రికార్డ్ టీఆర్పీ టార్గెట్ గా ఈ సినిమా ప్రసారం కానుంది. మరి కెజియఫ్2 ఏ రేంజ్ లో టీఆర్పీ రికార్డులని సృష్టిస్తుందో చూడాలి.