రజనీకాంత్ తో సినిమా అంటే మాటలా..? భయడుతున్న స్టార్ డైరెక్టర్, ఏంచేయబోతున్నాడంటే...?

By Mahesh JujjuriFirst Published Aug 13, 2022, 4:28 PM IST
Highlights

రజనీ కాంత్ తో సినిమానా..? అమ్మో అంటున్నాడు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. వరుస విజయాలతో కోలీవుడ్ లో స్టార్ డమ్ సాధించిన యంగ్ డైరెక్టర్.. సూపర్ స్టార్ తో సినిమా చేయాలంటే దానికి కొన్ని తప్పనిసరి అంటున్నాడు. 
 

తమిళ స్టార్ హీరో విజయ్ తో వరుస సినిమాలు చేసి వరుస సక్సెస్ లు కొట్టాడు. లోకనాయకుడు కమలహాసన్ ను డైరెక్ట్ చేసి ఆయన   కెరియర్లోనే బెస్ట్ మూవీగా విక్రమ్ ను అందించాడు. ముఖ్యంగా వసూళ్ల పరంగా కొత్త కొత్త రికార్డ్స్ క్రీయేట్ చేసిందీ విక్రమ్ మూవీ. ఇక ఈసినిమాతో లోకేష్ కనగరాజ్ కు సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ నుంచి కూడా రామ్ చరణ్ తో సినిమా కన్ ఫార్మ్ అయ్యింది అంటున్నారు. ఇక లోకేష్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తోంది. 

కమల్ హాసన్ కు  ఆ స్థాయి హిట్ ఇచ్చిన లోకేశ్ .. రజనీకాంత్ తో కూడా సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై  డైరెక్టర్  లోకేష్ కనకరాజ్ స్పందించారు. ఓ సందర్భంలో లోకేష్ మాట్లాడుతూ.. రజనీ సార్ తో సినిమా అంటే మాటలా? మార్కెట్ పరంగా .. క్రేజ్ పరంగా రజనీ సార్ కి తగిన కథను రెడీ చేయడం అంత తేలికైన పనేం కాదు అన్నాడు.

రజనీ సార్ తో సినిమా చేయాలనేది నా జీవితకాలపు కల. ఆయనతో చేసే సినిమా అంత ఆషా మాషీగా ఉండదు. అది ఎలా ఉండాలి అనే విషయంలో నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది అన్నారు లోకేష్.  అందుకు తగినట్టుగానే ఒక లైన్ ను రెడీ చేశాను. అది తప్పకుండా రజనీ సార్ కి నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాననే నమ్మకం నాకు ఉంది విరించారు లోకేష్ కనకరాజ్. 

ఇక విజయ్ ను డిఫరెంట్ గా చూపించిన లోకేష్.. వెండితెర నటరాజుగా పేరున్న కమల్ హాసన్ కే సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. ఇక అటువంటిది తనకు ఎంతో ఇష్టమైన తలైవా రజనీకాంత్ కోసం ఎలాంటి కథ రెడీ చేశాడు. ఎలా చేయబోతున్నాడో చూడాలని ఆడియన్స్ తో పాటు రజనీ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి రజనీకాంత్ కోసం లోకేష్ ఏం చేయబోతున్నాడో చూడాలిజ. 

click me!