ఓవర్సీస్ లో ‘కార్తీకేయ 2’కు మంచి ఓపెనింగ్స్.. రెస్పాన్స్ కూాడా అదిరిందిగా.!

Published : Aug 13, 2022, 04:15 PM IST
ఓవర్సీస్ లో ‘కార్తీకేయ 2’కు మంచి ఓపెనింగ్స్.. రెస్పాన్స్ కూాడా అదిరిందిగా.!

సారాంశం

యంగ్ హీరో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా  చిత్రం ‘కార్తీకేయ 2’ (Karthikeya 2). ఈ రోజు ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఓవర్సీస్ లో ‘కార్తీకేయ 2’కు సాలిడ్ ఓపెన్సింగ్ దక్కినట్టు తెలుస్తోంది.  

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) - యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తీకేయ 2’. ఈ చిత్రాన్ని చందూ మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథలాజికల్ ఫిల్మ్  ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మాత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగులో రూపొందించిన ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు స్టేట్స్ తో పాటు ఇతర సెంటర్లలోనూ ‘కార్తీకేయ 2’కు మంచి ఓపెనింగ్  జరిగినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో మాత్రం ‘కార్తీకేయ 2’కు తొలిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కాయి. కేవలం ప్రీమియర్స్ తోనే సుమారు లక్ష డాలర్స్ వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. రీసెంట్ గా ఓవర్సీస్ లో విడుదలైన సినిమాలతో పోల్చితే ‘కార్తీకేయ 2’ సాలిడ్ ఓపెన్సింగ్స్ ను దక్కించుకుంది. అటు ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ముఖ్యంగా చిత్రంలో నిఖిల్ నటనతో పాటు.. బలయమైన కథ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పిస్తుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇక మున్ముందుకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను ఎలా సాధిస్తుందో చూడాలి.

‘కార్తికేయ’కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వం వహించారు. మైథలాజికల్ నేపథ్యంలో వచ్చిన  ఈ చిత్రంలో నిఖిల్ ప్రధాన పాత్ర పోషించారు. గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు మూవీని నిర్మించాయి. అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ ఆయా  పాత్రల్లో నటించి మెప్పించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?