కేరళలో పడవల పోటీలు.. అతిథిగా తెలుగు హీరో!

Published : Nov 06, 2018, 11:07 AM IST
కేరళలో పడవల పోటీలు.. అతిథిగా తెలుగు హీరో!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో.. మలయాళంలో కూడా అంతే క్రేజ్ ఉంది. అక్కడ ప్రేక్షకులు బన్నీని మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటుంటారు. ఇటీవల కేరళలో వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. 

ఆ సమయంలో ప్రభుత్వంతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ రూ.25 లక్షల సహాయాన్ని అందించారు. కేరళని ఆదుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు.

దీంతో కేరళ ప్రభుత్వం బన్నీని ప్రత్యేకంగా అభినందించింది. ఇప్పుడు కేరళ ప్రభుత్వం నుండి బన్నీకి ఓ ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇప్పుడిప్పుడే కేరళ కోలుకుంటోంది. ఈ క్రమంలో అక్కడ పడవల పోటీలు నిర్వహించబోతున్నారు.

దీనికి ప్రత్యేక అతిథిగా రావాలని అల్లు అర్జున్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలప్పిలోని మాడ లేక్ లో జరగనున్న ఈ పోటీలో మొత్తం 81 బోట్లు పాల్గోనున్నాయి. పడవల పోటీకి బన్నీ తప్పకుండా వెళ్తాడని తెలుస్తోంది!
 
PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు