నాగశౌర్యకి ప్రొడ్యూసర్ షాక్!

Published : Nov 06, 2018, 10:29 AM IST
నాగశౌర్యకి ప్రొడ్యూసర్ షాక్!

సారాంశం

'నర్తనశాల' సినిమా ఫ్లాప్ కావడంతో హీరో నాగశౌర్య ఎక్కడా కనిపించడం లేదు. తొందరగా సినిమాలు చేయడం కంటే ఆలస్యంగానైనా.. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడికి ప్రొడ్యూసర్ నుండి షాక్ తగిలినట్లు సమాచారం. 

'నర్తనశాల' సినిమా ఫ్లాప్ కావడంతో హీరో నాగశౌర్య ఎక్కడా కనిపించడం లేదు. తొందరగా సినిమాలు చేయడం కంటే ఆలస్యంగానైనా.. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడికి ప్రొడ్యూసర్ నుండి షాక్ తగిలినట్లు సమాచారం.

బాలకృష్ణతో 'పైసా వసూల్', గోపీచంద్ తో 'లౌక్యం' వంటి సినిమాలు చేసిన నిర్మాత ఆనంద ప్రసాద్.. శౌర్య హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సివుంది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. 'నర్తనశాల' సినిమా తరువాత శౌర్యతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఆనంద ప్రసాద్ కూడా అదే పరిస్థితుల్లో పడ్డాడు. పైగా కొత్త దర్శకుడు కావడంతో బిజినెస్ ఏ రేంజ్ లో అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో సినిమా ఆపేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని శౌర్యతో నేరుగా చెప్పకుండా.. టీడీపీ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో తను సెర్లింగపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని  ఇప్పుడు తనకు డబ్బు అవసరం ఉందని, సినిమా కొన్ని రోజులు వాయిదా వేద్దామని శౌర్యని కన్విన్స్ చేశాడట నిర్మాత. అయితే ఈ ప్రాజెక్ట్ మళ్లీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదేమోనని భావించిన శౌర్య మరో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు!

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్