
హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మధ్య ఎఫైర్ వార్తల్లో నిలిచారు. ఒకరికి ముగ్గురితో ఆమెకు ఎఫైర్ అంటగడుతూ కథనాలు వెలువడ్డాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, కోలీవుడ్ స్టార్ విజయ్ లతో ఆమె ఎఫైర్స్ నడిపారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు సద్దుమణిగాక క్లాస్ మేట్ తో ప్రేమలో ఉన్నారంటూ మరో వాదన తెరపైకి వచ్చింది. కేరళకు చెందిన రిసార్ట్ ఓనర్ కీర్తి సురేష్ క్లాస్ మేట్ అని, వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని. వీరి బంధం గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిన పక్షంలో త్వరలో పెళ్లి ప్రకటన రావచ్చంటూ వార్తలొచ్చాయి.
ఈ వార్తలపై కీర్తి సురేష్ మౌనం వహించారు. ఆమె ఏ విధంగానూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక సురేష్ ఓపెన్ అయ్యారు. ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేనకను కీర్తి సురేష్ మీద వస్తున్న రూమర్స్ గురించి అడగ్గా... కీర్తి ఎవరినీ ప్రేమించడం లేదు. అలాంటిది ఏమైనా ఉంటే తాను మాకు చెబుతుంది. అప్పుడు మేము బహిరంగంగా మీడియాకు చెబుతాము.
కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న కథనాలు నిరాధారణమైనవి. తన మీద ఇలా పుకార్లు పుట్టిస్తున్నారంటే ఆమె కెరీర్లో ఎదుగుతున్నారని అర్థం... అని అన్నారు. కీర్తి సురేష్ అన్ని విషయాలు మాతో చెప్పుకుంటుంది. కాబట్టి ఆమెకు ఎలాంటి ఎఫైర్స్ లేవు,ఉంటే మాకు సమాచారం ఉంటుందన్నట్లు మేనక వెల్లడించారు. మేనక ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. తెలుగులో ఆమె తక్కువ చిత్రాలు చేశారు. మలయాళ, తమిళ భాషల్లో వందల చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.
మరోవైపు కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉంది. నానికి జంటగా నటించిన దసరా మార్చి 30న విడుదలైంది. దర్శకుడు శీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదల చేశారు. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి... తెలుగులో చిరంజీవి-మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఆమెది చెల్లెలు పాత్ర. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.