
యూనివర్సల్ హీరో ప్రభాస్ సినిమాల నుంచి అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ విషయంలో బాగా కోపంగా ఉన్నారు అభిమానులు. సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ ఏం చేస్తాడా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక శ్రీరామనవమి కావడంతో.. ప్రభాస్ అభిమానులు ఆదిపురుషక్ నుంచి అప్ డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేసి గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈసినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. సీత బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తోంది. అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.
అయితే ఆదిపురుష్ విషయంలో కోపంగా ఉన్న అభిమానులను కూల్ చేయడం కోసం.. ఈ శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్ డేట్స్ ఇస్తాం అన్నారు మూవీ టీమ్. అన్నట్టుగానే నవమి సందర్భంగా.. సీతారాముల మహా దర్శనం లుక్ లో ప్రభాస్, కృతీ సనన్ తో పాటు .. లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ప్రభాస్ రాముడి అవతారంలో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నిండుగా.. అభిమానులకు కనువిందు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్ రిలీజ్ అవ్వగా అది ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతే కాదు ఎన్నో విమర్షలను కూడా ఫేస్ చేసింది. దాంతో.. ఇప్పటి నుంచి వచ్చే అప్ డేట్స్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణించుకున్నారట మేకర్స్.
ఈ పోస్టర్ కు చిన్న ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు టీమ్.. మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ అంటూ పోస్టర్ లో రాసుకోచ్చారు. ఇక ఆదిపురుష్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.. ఈసినిమాను జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ప్రభాస్ షేర్ చేస్తూ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ ఆదిపురుష్ ను నిర్మిస్తున్నారు. తన్హాజీ సినిమాతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించిన ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.