
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉన్నారు. ఆమధ్య వరకూ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అమెరికాలో హడావిడిచేసిన చరణ్.. ఆస్కార్ సాధించి సంబరాలు చేశారు.. ఆతరువాత తన బర్త్ డే పార్టీ.. ఆస్కార్ పార్టీ.. నన్మానాలు సత్కారాలతో పాటు.. తన Rc15 నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ పనుల్లో తలమునకలై ఉన్న చరణ్.. ఇక అన్నీ చక్కబెట్టుకుని దుబయ్ చెక్కేశారు. తన భార్య ఉపాసనతో కలిసి.. సొంత ప్లైట్ లో రామ్ చరణ్ దుబయ్ వెకేషన్ కు వెళ్లారు. వీరితో పాటు ఎంతో ప్రేమగా చూసుకునే పెట్ డాగ్ రైమ్ కూడా వీరితో ఉంది.
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ప్లైట్ లో ఈ స్టార్ కపుల్ దుబాయ్ వెళ్లారు. అయితే వీరు ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పోటోస్ ను స్వయంగా ఉపాసన ఇన ఇన్ స్టా స్టోరీస్ లో శేర్ చేశారు. అయితే ఈ ఫోటోస్ లో రామ్ చరణ్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఫుల్ హ్యాండ్సమ్ లుక్ లో.. రామ్ చరణ్ లుక్ చూసి.. మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అంతే కాదు అదుర్స్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ కొన్ని రోజులు హాలీడే ట్రిప్ లో రెస్ట్ తీసుకోబోతున్నారు. ఆతరువాత తరిగిరాగానే.. గేమ్ చెంజర్ షూటింగ్ లో పాల్గొనున్నట్లు తెలుస్తుంది.
ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా అంతా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు శంకర్. ఆయన ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్2 మూవీ ఇంపార్టెంట్ షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఆతరువాత చరణ్ సినిమాను కూడా అంతే స్పీడ్ గా.. సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.