అలక బూనిన పవన్ కళ్యాణ్ బుగ్గలు పిండిన కీర్తి సురేష్

Published : Dec 09, 2017, 03:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అలక బూనిన పవన్ కళ్యాణ్ బుగ్గలు పిండిన కీర్తి సురేష్

సారాంశం

సంక్రాంతికి రానున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీకి సంబంధించి ఏ చిన్న లీకేజీ జరిగిన సోషల్ మీడియాలో వైరల్ తాజాగా పవన్ బుగ్గలు గిల్లుతున్న కీర్తి సురేష్ పిక్ వైరల్

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సారి మాత్రం గతంలోకంటే రెట్టింపు స్థాయిలో ఆజ్ఞాతవాసికి సంబంధించిన మరో ఫొటో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.

 

అజ్ఞాతవాసి హిరోయిన్ కీర్తి సురేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుగ్గలను గిల్లే సిన్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఫొటోలో పవన్ కొంచెం అలకతో ఉండగా... కీర్తి తన చేతులతో పవన్ బుగ్గలను ప్రేమతో గిల్లడం చాలా బావుంది అంటున్నారు సినీ ప్రేమికులు. 



ఫొటోలోనే ఇంత బావుంటే సినిమాలో ఈ జంట ఎంత బావుంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్  అంతా పూర్తి చేసిన చిత్ర యూనిట్ త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేయనుంది. పవన్ ప్రస్థుతం జనసేన కార్యక్రమాల్లో బిజీగా వున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా త్రివిక్రమ్ పక్కా ప్రణాళికలతో దగ్గరుండి కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నాడు. ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పిక్ ఒకసారి మీరూ చూడండి.


 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు