సైరాకు థమన్ లేనట్టే.. పరిశీలనలో కీలకమైన పేరు

First Published Dec 9, 2017, 2:48 AM IST
Highlights
  • సైరా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ఎ ఆర్ రెహమాన్
  • దీంతో థమన్ కే సైరా సంగీతం ఛాన్స్ అనుకున్న మెగాఫ్యాన్స్
  • రామ్ చరణ్ మనసులో మరో సంగీత దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' సినిమా షూటింగ్ మొదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్‌గా ప్రకటించిన తర్వాత మెయిన్ టెక్నీషియన్స్ విషయంలో చాలా మార్పులు జరిగాయి. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా మొదట రవివర్మన్‌ను అనుకున్నారు. అయితే పలు కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో రత్నవేలు ఈ ప్రాజెక్టుకు ఓకే అయ్యాడు.

తొలుత సైరా చిత్రానికి సంగీతం అందించేది ఎ.ఆర్.రెహమాన్ అని ప్రకటించినా,.. దీనిపై తాజాగా వస్తున్న వార్తల్ని ఖండించకపోవడంతో... ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఇటీవల వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.

 

రెహమాన్ స్థానంలో ‘సైరా' ప్రాజెక్టులోకి తమన్ వచ్చే అవవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ‘సైరా' మోషన్ పోస్టర్ కు తమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు. అయితే సైరాకు తమన్ సంగీతం అందించే అవకాశం లేదని తాజా సమాచారం.

 

‘సైరా నరసింహారెడ్డి' అనేది 150 కోట్ల ప్రాజెక్ట్. నేషనల్ లెవల్లో చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా. ఈ లాంటి సినిమాకు తమన్ సరిపోడని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడట. నెక్ట్స్ మూవీ ఛాన్స్ ఇస్తానన్న చరణ్ ‘సైరా' విషయంలో తాను రిస్క్ చేయలేనని, తాను హీరోగా చేసే తర్వాతి సినిమాకు చాన్స్ ఇస్తానని తమన్‌కు సుతిమెత్తగా చెప్పాడట చెర్రీ. తమన్ గతంలో చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

 

మరోవైపు బాహుబలి సినిమాకు సంగీతం అందించిన కీరవాణి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్ దాదాపు ఓ నిరర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. 
 

click me!