కాపు రాజ్యం రావాలి,పవన్ కళ్యాణ్ సీఎం కావాలి-కత్తి మహేష్

First Published Dec 8, 2017, 9:01 PM IST
Highlights
  • పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సందేహాలు మాత్రమే అడిగానంటున్న కత్తి మహేష్
  • ఓ ఛానెల్ చర్చా గోష్టిలో  పవన్ కాపును కాదన్నా ఆ కుల ముద్ర తప్పదన్న కత్తి
  • సోషల్ థియరీ ప్రకారం ఏపీలో కాపులు అధికారంలోకి రావాలని,  పవన్ సీఎం కావాలని కత్తి వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విరుచుకుపడే కత్తి మహేష్ నోట పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే మాట వినిపిస్తే ఎలా వుంటుంది. అదెలా జరుగుతుందనుకుంటున్నారా.. కానీ జరిగింది. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నానన్నారు. ఓ ఛానెల్ చర్చా గోష్టిలో కత్తి మహేష్ చేసిన అసక్తికర వ్యాఖ్యలు ఎలా వచ్చాయో చూడండి.

 

పవన్ ను ప్రశ్నిస్తానంటూ ఓ ఛానెల్ లైవ్ షోలో పాల్గొన్న కత్తి మహేష్ కుల సమీకరణాలు-రాజకీయాల్లో ప్రభావం అన్న అంశం కేంద్రంగా మాట్లాడుతూ .. ప్రస్థుతం ఏపీలో కాపులు రాజ్యాధికారానికి దగ్గరగా వున్నారు. పవన్ కళ్యాణ్ కు అధికారం రావాలి. కాపు వర్గంలో కూడా ఆర్థికంగా బలంగా వున్నవారున్నారు. కుల సమూహాలుగా ఏర్పాటైన ఏ సమాజంలోనైనా... తదుపరి బలం వున్న కులాలకు అధికారం దక్కుతూ వస్తోంది. ఆ క్రమంలో సామాజిక న్యాయం ఆశించే వ్యక్తిగా నేను కాపులు అధికారంలోకి రావాలనే కోరుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ కు కత్తి మహేష్ మద్దతిచ్చారు.

 

తరచూ పవన్ కళ్యాణ్ ను , పవన్ ఫ్యాన్స్ ను విమర్శించే కత్తి మహేష్ ఇలా పవన్ సీఎం కావాలంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇదే చర్చలో పవన్ కళ్యాణ్ కేవలం కమ్మ,కాపు కలిస్తే రాజ్యాధికారం పంచుకోవచ్చనే భావనతో మాట్లాడినట్లు కనిపించింది తప్ప మరేం లేదని కత్తి మహేష్ స్పష్టం చేసారు.

 

చర్చాగోష్టిలో భాగంగా ప్రముఖ నటీమణి, కాపు సామాజిక వర్గానికే చెందిన హేమ తో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కాపు అంటే అస్సలు ఒప్పుకోనని హేమ వాదించారు. తమ ఉద్యమానికి మద్దతివ్వనందుకు, కాపునని చెప్పుకోనందుకు పవన్ అంటే కోపమని హేమ అన్నారు. ఈ సందర్భంలో... తాను అవునన్నా కానన్నా... పవన్ కల్యాణ్ కాపు అన్నారు. సామాజికంగా ఆ ముద్ర ఖచ్చితంగా వుంటుందని కత్తి మహేష్ స్పష్టం  చేశారు. 

 

చివరగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నా జీవితంలోంచి వెళ్లాలనేదే నా డిమాండ్ అని, కనీసం తనను పట్టించుకోకుండా వుంటే చాలని పవన్ ఫ్యాన్స్ కు సూచించాడు కత్తి మహేష్.

click me!