కీర్తి ఖాతాలో మరో భారీ ప్రాజెక్టు

Published : Jul 08, 2017, 03:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
కీర్తి ఖాతాలో మరో భారీ ప్రాజెక్టు

సారాంశం

మరో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న కీర్తి సురేష్ ప్రస్థుతం మహానటి, పవన్ కళ్యాణ్ చిత్రాల్లో కీర్తి తాజాగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో ఆఫర్ కొట్టేసిన కీర్తి

నేను శైలజ సినిమాతో తొలిసినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ తనవైపు తిప్పుకున్న మలయాళ భామ కీర్తి సురేష్. ఆ తర్వాత నానితో నేను లోకల్ చేసింది. ప్రస్థుతం నేను మహానటి అంటున్న కీర్తి పవన్ కళ్యాణ్ 25వ సినిమాలో ప్రియ పాత్రలో నటిస్తోంది. ఇక కీర్తి తాజాగా మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో ఫైనల్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ సొంతం చేసుకుంది.

 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి డైరక్షన్ లో రాబోతున్న చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని సమాచారం. శర్వానంద్ హీరోగా చేయబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.  ఇక ఇవే కాకుండా కీర్తికి చాలానే భారీ ఆఫర్లు క్యూలో ఉన్నాయట. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తమిళంలో కూడా వరుస సినిమాలను చేస్తుంది. ఇలా క్రేజీ ఆఫర్లు కొట్టేస్తూ.. కీర్తి తోటి నటీమణులను క్రాస్ చేసే విధంగా సినిమాలు చేస్తోంది. 

 

అందం అభినయం కలగలిపి పక్కింటమ్మాయిలా ఉండే కీర్తి సురేష్ తెలుగులో రెండు సినిమాలకే యూత్ ను ఆకట్టుకుంది. ప్రకాశ్ చేసిన అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరోలలో హీరోయిన్స్ కు ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. అదే తరహాలో కీర్తిని కొత్తగా చూపించేందుకు సిద్ధమయ్యాడు ప్రకాశ్. మరి ఈ సినిమాలో కీర్తి ఎలా ఉండబోతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌