Brahmamudi: అర్ధరాత్రి గడప దాటిన కావ్య.. నట్టింట్లో నిప్పు రగిల్చిన రుద్రాణి!

Published : Mar 15, 2023, 01:00 PM IST
Brahmamudi: అర్ధరాత్రి గడప దాటిన కావ్య.. నట్టింట్లో నిప్పు రగిల్చిన రుద్రాణి!

సారాంశం

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్ కి పోటీ ఇస్తూ టిఆర్పి రేటింగ్స్ లో సెకండ్ ప్లేస్ లో చోటు దక్కించుకుంది. అబద్ధాలతో ప్రారంభమైన భార్య భర్తల కథ ఇది. ఇక ఈరోజు మార్చి 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో అందరివి తిని తను ఎందుకు పస్తులు పడుకోబెట్టడం శాంత తో భోజనం పంపించు అంటాడు రాజ్. అంతలోనే ధాన్యలక్ష్మి, కావ్య ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువస్తుంది. అందుకు కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆపర్ణ. ఆమె ని పిలుస్తూ ఆమె వెనకే వెళుతుంది ధాన్యలక్ష్మి. కూర్చోండి వదిన అంటాడు కళ్యాణ్.

కూర్చోవాలో, కూర్చోకూడదో అర్థం కావట్లేదు అంటుంది కావ్య. నాక్కూడా భోజనం వదిలేయాలో తినాలో ఇకనుంచి వెళ్ళిపోవాలో అర్థం కావట్లేదు అని వెటకారంగా అంటాడు రాజ్. ఇద్దరూ లేవకండి, కూర్చొని తినండి అంటాడు కళ్యాణ్. కావ్య కూర్చోబోతే కోపంగా పళ్లెంలో చేయి కడుక్కొని వెళ్ళిపోబోతాడు రాజ్. ఎవరి మీద కోపాన్ని భోజనం మీద చూపించొద్దు అన్నయ్య అంటాడు కళ్యాణ్.

కొందరి మొహాలు చూస్తే ముసుగే గుర్తొస్తుంది అంటే కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు రాజ్ . రేఖ కూడా చేతులు కడిగేసుకుంటుంటే నీకేమైంది అంటాడు కళ్యాణ్. ఇలాంటి ఫుడ్ మీరు పండుగలప్పుడు కూడా తినరు కదా మా బావ ఫుడ్ కూడా కలిపి నువ్వే తిను అంటుంది రేఖ. నిజమే కానీ ప్రతిరోజు అన్నానే తింటాము అందుకే మేము ఆ అన్నాన్ని గౌరవిస్తాము అంటుంది కావ్య.

కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేఖ. మీరు భోజనం చేయండి వదిన అని కళ్యాణ్ అంటే నావల్ల ఎంతమంది భోజనం చేయకుండా వెళ్ళిపోయారు వాళ్లని కాదని నేను భోజనం చేయలేను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు కావ్య గారికి వచ్చిన రుద్రాణి ఇకనుంచి లేని గొడవల కి శ్రీకారం చుట్టాలి కదా అనుకుంటూ కావ్యని పిలుస్తుంది. నీ భవిష్యత్తు తెలుసుకొని బాధపడుతున్నావా  అంటుంది రుద్రాణి.

సానుభూతి చూపిస్తున్నారా అంటుంది కావ్య. నా సానుభూతి నీకు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు అంటూ మీ అమ్మ వాళ్లు ఫోన్ చేశారని చెప్తుంది రుద్రాణి. ఎలా ఉన్నారు బానే ఉన్నారా నా గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు అంటుంది కావ్య. వాళ్లు బాధపడతారని జరిగిందేది చెప్పలేదు అయినా మీ అమ్మ మీ అక్క కోసమే ఎక్కువ బాధపడుతుంది అంటుంది రుద్రాణి.

అక్క ఇంకా తిరిగి రాలేదా అంటుంది కావ్య. తను ఇంకా రాలేదు అంటే ఏదో జరిగే ఉంటుంది, ఎవరితోనైనా వెళ్ళిపోయి ఉంటుంది అంటుంది రుద్రాణి. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు సేఫ్ గా తిరిగి రారు అసలు వస్తారో రారో కూడా తెలియదు సోషల్ మీడియాలో మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మంచిది అంటుంది రుద్రాణి. ఆపండి నేను ఇంక వినలేకపోతున్నాను అంటుంది కావ్య.

నీ ఇష్టం చెప్పాల్సింది చెప్పాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనుకుంటూ ముసుగు వేసుకొని బయటకు వెళ్తుంది కావ్య. అది గమనించిన రుద్రాణి ఈ ఇంటిలో మొదటి రోజే సమర శంఖం పూరిస్తాను అనుకుంటుంది. రాజ్ కి కావ్యకి మధ్య వార్ డిక్లేర్ చేస్తాను అనుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య కనిపించడం లేదు అని చెప్తుంది.

సెక్యూరిటీ కి ఫోన్ చేస్తే బయటికి వెళ్లిందని చెప్తున్నారు అంటుంది. ఇక్కడ తన ఆటలు సాగవని అర్థం చేసుకొని ఉంటుంది పోతే పోనీ మనకెందుకు అంటాడు రాజ్. ఆ అమ్మాయి దుగ్గిరాల వారి గోడలని మీడియా వాళ్లు కవర్ చేసేసారు. ఇప్పుడు బయటికి వెళ్లిన తనకి జరగరానిది ఏమైనా జరిగితే మనమెడకి చుట్టుకుంటుంది అంటుంది రుద్రాణి. మరోవైపు రాహుల్ కి ఇంకా రాకపోవడంతో కంగారు పడుతుంది స్వప్న.

తను పేపర్లో న్యూస్ చూసేసాడా కావ్య నా చెల్లెలు అని తెలిసిపోయిందా అనుకుంటూ రాహుల్ కి ఫోన్ చేస్తుంది. తనే ఫోన్ చేస్తుంది ఈపాటికి పేపర్లో న్యూస్ చూసి ఉంటుంది అందుకే కంగారుపడి ఫోన్ చేస్తుంది. నన్ను చేసిన మోసానికి ఈ రాత్రంతా ఒంటరిగా పడి ఉండు. నిన్ను పూర్తిగా వదిలేస్తే నువ్వు నేరుగా మా ఇంటికి వెళ్తావు అప్పుడు నా నిజస్వరూపం బయట పడిపోతుంది అనుకుంటూ ఫోన్ కట్ చేసేస్తాడు.

స్వప్న కూడా వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దామంటే నా నిజ స్వరూపం బయట పడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలో అంటూ ఆలోచనలో పడుతుంది. మరోవైపు కావ్య కోసం కంగారుగా అటు ఇటు తిరుగుతుంటాడు రాజ్. అత్తగారింట్లో కొత్తకోడలతో పెళ్ళికొడుకు యుద్ధం, చూడటానికి నేను సిద్ధం అంటూ ఆనంద పడిపోతుంది రుద్రాణి. ఇంతలోనే కావ్య ముసుగుతో లోపలికి వస్తుంది.

 మళ్లీ ముసుగేసుకున్నావ్ మీ ఫ్యామిలీలో కంపులు నుంచే ముందు ముసుగేసుకోవడం సాంప్రదాయమా, ఇప్పుడు ముసుగేసుకుని వెళ్లి ఎవరు కొంప ముంచొస్తున్నావ్ అని అడుగుతాడు రాజ్. రేపొద్దున మాట్లాడుకుందాం అంటుంది కావ్య. ఇప్పుడే పోట్లాడుకుందాం అంటాడు రాజ్. రాత్రి 9 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి మనిద్దరం ఒకరి మొహాలు ఒకటి చూసుకోకూడదు అంటుంది కావ్య.

లైఫ్ లాంగ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా ఉండే సాంప్రదాయం ఉంటే బాగుండు అంటాడు రాజ్. మీతో వాదించే ఓపిక నాకు లేదు అంటూ కావ్య వెళ్ళిపోతుంటే నాక్కూడా నీ మొహం చూడాలని ఉత్సాహం ఏమీ లేదు ఇంతకీ ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతాడు రాజ్. రేపొద్దున్న చెప్తాను అంటుంది కావ్య. ఇప్పుడే చెప్పాలి అంటూ ఆమెని పట్టుకుంటాడు రాజ్.

కావ్య స్పృహ తప్పి అతని చేతుల్లోనే పడిపోతుంది. కంగారు పడిపోతాడు రాజ్. ఈ సీన్ నేనొక్కదాన్నే చూస్తే ఎలా అందరూ చూడాలి అనుకుంటూ గట్టిగా కేకలు వేసుకుంటూ కిందికి వస్తుంది రుద్రాణి. ఆ హడావుడికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. ఏం జరిగింది అంటే కళ్ళు తిరిగి పడిపోబోతే పట్టుకున్నాను అంటాడు రాజ్. ఆమెని కూర్చోబెట్టి సఫర్యలు చేస్తారు రాజ్,చిట్టి.

భోజనం పెట్టకపోతే ఇలాగే కళ్ళు తిరుగుతాయి అంటాడు కళ్యాణ్. భోజనం పెట్ట లేదా అని అడుగుతుంది చిట్టి. భోజనం కోసం వస్తే అన్నయ్య చెయ్ కడుక్కొని కోపంగా వెళ్ళిపోయాడు అందుకే వదిన బాధపడి భోజనం చేయలేదు అంటాడు కళ్యాణ్. ఇన్నాళ్లుగా ఉన్న అన్నయ్యని మర్చిపోయి ఇవాళ వచ్చిన అమ్మాయిని వెనకేసుకొస్తున్నావా అంటాడు రాజ్. నేను అబద్ధం చెప్పడం లేదు జరిగింది చెప్తున్నాను అంటాడు కళ్యాణ్.

 నిండు ఇంట్లో కోడలు ఆకలితో ఉంటే అంత అరిష్టమో తెలుసా అంటూ రాజ్ మీద కేకలు వేస్తుంది చిట్టి. ధాన్యలక్ష్మికి భోజనాన్ని తెమ్మని చెప్పి మీ ఇద్దరినీ ఒకరి మొహాలు ఒకరు చూసుకోవద్దని చెప్పాను కదా ఎందుకు ఎదురుపడ్డారు అని రాజ్ ని నిలదీస్తుంది చిట్టి. ఈ ముసుగు పెళ్లికూతురు రాత్రిపూట ఎక్కడికో వెళ్లి వచ్చింది అని చెప్తాడు. ఈ రాత్రప్పుడు బయటకు వెళ్లిందా అంటే కోపంగా ఎక్కడికి వెళ్లావు అని నిలదీస్తుంది అపర్ణ.

ఏంటి ఆడవాళ్ళు ఇప్పటివరకు అర్ధరాత్రి బయటకు వెళ్లిందే లేదు  అపర్ణ ఇప్పటినుంచి ఆచారం తను మొదలు పెడుతుంది అంటాడు రాజ్. ఆకలి వేసి ఏ రోడ్డు పక్కన ఇడ్లీ తినడానికి వెళ్లి ఉంటుంది అంటుంది రుద్రాణి. నాకు అలాంటి అలవాటు లేదు అంటుంది కావ్య. ముందు నువ్వు భోజనం చెయ్యు అంటుంది చిట్టి. నావల్లే మీ మనవడు భోజనం చేయలేదు ముందు ఆయన్ని చేయమనండి తర్వాతే నేను చేస్తాను అంటుంది కావ్య.

సాంప్రదాయంగా పెళ్లి జరిగిన వాళ్లు పాటించవలసిన పద్ధతి ఇది అంతేగాని ముసుగు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఈ పద్ధతి వర్తించదు అంటాడు. అన్న మీద గొడవలు ఏంటి మీ తాతయ్యని లేపమంటావా ముందు నువ్వు అన్నం తిను అంటుంది చిట్టి. నాకు ఆకలి లేదు నేను తినను అని చెప్పాను కదా అంటాడు రాజ్. నేను తినను అంటుంది కావ్య. నా వల్లే  నువ్వు తినలేదు కదా ఇప్పుడు తినిపిస్తాను అంటూ బలవంతంగా ఆమె నోట్లో ముద్దలు కుక్కుతాడు రాజ్.

ఇలా బలవంతంగా తినిపించడం పద్ధతి కాదు అంటూ మందలిస్తుంది చిట్టి. అన్నాన్ని అవమానిస్తే ఆ అన్నపూర్ణ ని అవమానించినట్లే అందుకే మీ రాక్షసత్వాన్ని కూడా సహించి పన్నుల్ని దిగమింగుతున్నాను, కానీ మీరు చేసిన అవమానాన్ని మాత్రం మర్చిపోలేను ఇంతకీ ఇంత తిరిగి ఇచ్చేస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

తరువాయి భాగంలో ఈ పళ్ళు, పూలు, బట్టలు తీసుకొని ఆమె చేతుల్లో పెట్టి ఆమె నా భార్య అని బాధ్యత తీసుకో అంటుంది చిట్టి. మీ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాధ్యత కూడా నాదే ఇప్పుడు మరొక పనిమనిషి  పెరిగింది అంటూ పళ్ళని ఆమెకి ఇవ్వబోతాడు రాజ్. నాకు వద్దంటుంది కావ్య.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి