మెగాహీరో సినిమాలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

Published : Oct 02, 2018, 02:30 PM IST
మెగాహీరో సినిమాలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

సారాంశం

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 82 సినిమాలలో నటించిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి ఆశించిన గుర్తింపు లభించలేదు. సీరియళ్లలో నటిస్తున్నా.. పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ బిగ్ బాస్ షో అతడి కెరీర్ గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది. ఈ షో కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 82 సినిమాలలో నటించిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి ఆశించిన గుర్తింపు లభించలేదు. సీరియళ్లలో నటిస్తున్నా.. పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ బిగ్ బాస్ షో అతడి కెరీర్ గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది.

ఈ షో కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతడి కోసం ఏర్పడ్డ కౌశల్ ఆర్మీ ఇప్పుడు ఏకంగా క్రౌడ్ ఫండింగ్ తో కౌశల్ హీరోగా సినిమా చేయబోతుంది. తాజాగా కౌశల్ కి మెగాహీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతంఈ సినిమా షూటింగ్ యూరప్ లోని అజర్‌బైజార్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం కౌశల్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బోయపాటి దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి.

అయితే అది బాలయ్య సినిమా కోసమని అన్నారు. కానీ ఇప్పుడు కౌశల్ కి మెగాహీరో రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని వార్తలు బయటకి రావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై బోయపాటి కానీ, కౌశల్ కానీ స్పందిస్తారేమో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని: కౌశల్ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ