'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

Published : Oct 02, 2018, 01:36 PM IST
'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

సారాంశం

రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం '2.0'. దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెండు వేలకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండబోతున్నాయి. 

రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం '2.0'. దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెండు వేలకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండబోతున్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసింది చిత్రబృందం.

ఇప్పటికే ఈ సినిమా పోస్తర్లు, టీజర్ విడుదల చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మధ్య మధ్యలో మేకింగ్ వీడియోలు వదులుతూ అంచనాలను మరింతగా పెంచేస్తుంది. తాజాగా మరో మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం.

ఈ వీడియోలో కనిపిస్తోన్న విజువల్ ఎఫెక్ట్స్, మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మేకింగ్ వీడియోనే ఇలా ఉందంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే ఐశ్వర్యారాయ్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది.  

PREV
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు