Kaushal:షకీలా అడల్ట్ సినిమాలో చేసా ...అదే నాశనం చేసింది

Surya Prakash   | Asianet News
Published : Feb 14, 2022, 01:05 PM IST
Kaushal:షకీలా అడల్ట్ సినిమాలో చేసా ...అదే నాశనం చేసింది

సారాంశం

 ఆ విమర్శలు, ట్రోలింగ్‌ నుంచి బయటపడేందుకు చాలా టైం పట్టింది. ఆ తర్వాత చక్రవాకం సీరియల్ చేశాక నాపై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోయింది


కెరీర్ ప్రారంభ దశలో ఆప్షన్స్ మన చేతిలో ఉండవు. ఎలాంటి అవకాసం వచ్చినా ముందుకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే ఎదిగాక అప్పుడు చేసిన సినిమాలు గురించి చాలా మంది బాధపడుతూంటారు. అప్పుడు ఎలా ఒప్పుకున్నాం అని అనుకుంటారు. అలాంటిదే  
టీవీ నటుడు, మోడల్‌ కౌశల్‌ బిగ్‌బాస్‌ ఫేమ్ కౌశల్ జీవితంలో జరిగింది. ఆ విషయం ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ఓ సినిమా తన కెరీర్‌ను నాశనం చేసిందన్నారు  కౌశల్‌.

కౌశల్ మాట్లాడుతూ...‘అప్పుడు మా అమ్మకి క్యాన్సర్ . ఆ టైమ్ లో  డబ్బు అవసరం చాలా వచ్చింది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. హాస్పటల్‌లో డబ్బులు కట్టడం కోసమే అప్పట్లో నేను ఒక సినిమాకి కమిట్ అయ్యాను. ఆ మూవీకి నా రెమ్యునరేషన్‌ రూ.50 వేలు ఇచ్చారు. కానీ ఆ సినిమా వల్లే నా కెరియర్ నాశనం అయ్యింది. సమాజానికి ఒక సందేశంగా ఉంటుందని ఆ సినిమా చేశా. కానీ అది అడల్ట్ మూవీ కావడంతో.. కౌశల్ అడల్ట్ మూవీస్ చేస్తాడనే ముద్ర పడింది’ అన్నాడు.
 
అదే సమయంలో ఎయిడ్స్‌ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండేది. దానిపై అవగాహనలో భాగంగా ఈ సినిమా తీశాం. కానీ అందులోని నా పాత్ర నెగిటివ్‌ ఇంప్రెషన్‌ పడింది. ఆ విమర్శలు, ట్రోలింగ్‌ నుంచి బయటపడేందుకు చాలా టైం పట్టింది. ఆ తర్వాత చక్రవాకం సీరియల్ చేశాక నాపై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోయింది’ అన్నాడు.

ఇంతకీ కౌశల్‌కు అంతగా చేదు అనుభవాన్ని ఇచ్చిన ఆ అడల్ట్‌ మూవీపై పేరు స్వర్ణ. ఈ సినిమాలో రమ్య శ్రీ హీరోయిన్ కాగా.. షకీలా, రేష్మ ఇతర పాత్రల్లో నటించారు. రమ్య శ్రీ ఇంట్లో పనోడిగా చేరిన కౌశల్.. కోరిక తీర్చమంటూ ఆమె వెంటపడే నెగిటివ్‌ రోల్‌ చేశాడు. చివరికి ఈ సినిమాలో కౌశల్‌ కట్టుకున్న భార్య చేతిలో చనిపోతాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌