
సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11 నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగు సినిమాల్లో మామూలుగా కనిపించదు. ఒకవైపు, చిత్రనిర్మాతలు విడాకుల వంటి సున్నితమైన అంశాల జోలికి వెళ్లకుండా ఉంటారు.. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా సరదాగా సినిమాను చిత్రీకరించేందుకే ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ తమ సినిమాపై పడకుండా చూసుకుంటున్నారు.
కానీ ప్రేక్షకులు మాత్రం ఈ రిలేషన్ షిప్ డ్రామా పట్ల ఫిదా అవుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ‘మళ్లీ మొదలైంది’ మూవీ జీ5 ఓటీటీలో స్రీమింగ్ అవుతోంది. దాదాపుగా 50 వేలకు పైగా జీ5 సబ్ స్క్రైబర్స్ ఈ మూవీని తిలకించారు. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ ఈ సినిమాకు 6.4 రేటింగ్ ను అందించింది. మరోవైపు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్, కామెడీ ఎలమెంట్స్ ఉండటంతో ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల నిమిషాలను సొంతం చేసుకుంది. ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకులు ఈలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఎలాంటి డబుల్ మీనింగ్ జోకులు, అసభ్యత లేకుండా ఈ కంటెంట్ వారాంతంలో విజేతగా నిలిస్తోంది.
ఈ మూవీకి ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ పట్ల దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ ‘‘విడాకులు తీసుకున్న ఓ జంట కథ కొత్తగా మళ్లీ ఎలా మొదలైంది అన్నదే మా ‘మళ్ళీ మొదలైంది’.నా స్నేహితుడి జీవితంలోని కొన్ని సంఘటనలతో ఈ సినిమాను తీశామని తెలిపారు. ‘నా సర్కిల్‌లో సినిమాకు మంచి స్పందన వస్తోంది’ అని సుమంత్ కూడా చెప్పారని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. ఆడియెన్స్ కూడా మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలనే ఇష్టపడుతున్నారు. నేనూ అలాంటి సినిమాలనే తీయాలనుకుంటున్నానని కూడా తెలిపారు.
కథ విషయానికొస్తే.. చెఫ్ విక్రమ్ (సుమంత్ కుమార్) తన తల్లి సుజాత (సుహాసిని) ఇచ్చే ధైర్యంతో ఏదైనా చేస్తుంటాడు. విక్రమ్ మరియు నిషా (వర్షిణి సౌందరరాజన్)కు పెళ్లి అవుతుంది. వీరి మధ్య వచ్చే ఘర్షణలతో విడిపోవాలని అనుకుంటున్నారు. అయితే విక్రమ్ తన వైఫ్ నుంచి డివోర్స్ వచ్చేందుకు సహకరించిన లాయర్ ను ప్రేమిస్తాడు. ఆ తర్వాత మళ్లీ ఆ జంట కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. అలా డివోర్స్ తీసుకోవడానికి మ్యారేజ్ లైఫ్ లో ఏదురయ్యే సమస్యలు, ఘర్షణల మధ్య సాగేదే ఈ చిత్రం. ఫ్యామిలీ మెచ్చుకోదగిన చిత్రం ఇది.
ఈ మూవీలో యాంకర్ ‘వర్షిణి’ కూడా నటించడంతో బుల్లితెర ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతంలో, సిద్ శ్రీరామ్ అందించిన ‘అలోన్ అలోన్’ ట్రాక్ ప్రత్యేకంగా నిలిచింది. మిగిలిన సాంగ్స్ కూడా సాంగ్స్ లవర్స్ ను మెప్పిస్తున్నాయి.