బిగ్ బాస్: కౌశల్ కోసం భారీ ర్యాలీ!

By Udayavani DhuliFirst Published Sep 9, 2018, 11:53 AM IST
Highlights

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. హౌస్ లో అతడిని ఒంటరి చేసి హౌస్ మేట్స్ గ్రూపులు కట్టడంతో అతడికి అండగా.. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. హౌస్ లో అతడిని ఒంటరి చేసి హౌస్ మేట్స్ గ్రూపులు కట్టడంతో అతడికి అండగా.. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఈ ఆర్మీ ఒకానొక దశలో షోని శాసించే స్థాయికి వెళ్లింది. ఇప్పుడు కౌశల్ కి ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందో.. నిరూపించడానికి అన్నట్లుగా కౌశల్ ఆర్మీ 2కె రన్ నిర్వహించించి.

ఆదివారం మాదాపూర్ లో మొదలైన ఈ 2కె రన్ కి భారీ మద్దతు లభించింది.. కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా ర్యాలీలో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కౌశల్ ఆర్మీ ప్రత్యేకంగా టీ షర్ట్ లను వేసుకొని అభిమానవులంతా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇక బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో కౌశల్ ని విజేతగా చేయడానికి ఎంత చేయాలో.. అంతా చేస్తుంది కౌశల్ ఆర్మీ. ఒక వ్యక్తికి ఈ రేంజ్ లో ప్రేక్షకాదరణ దక్కడం కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనంతకీ కారణం కౌశల్ ఆడే తీరు, ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే చెప్పడం, అతడి ప్రవర్తన అని తెలుస్తోంది.  

ఈ వార్తాకథనాలు కూడా చదవండి

బిగ్ బాస్2: కౌశల్ భార్యకి దండం పెట్టాలి.. దీప్తి షాకింగ్ కామెంట్స్!

కౌశల్ కోసం కౌశల్ ఆర్మీ ఏం చేస్తుందో తెలుసా..?

బిగ్ బాస్2: ఎలిమినేషన్ ట్విస్ట్.. ఆ ఇద్దరిలో వెళ్లేదెవరో..?

click me!