బిగ్ బాస్2: కౌశల్ భార్య సంగతి నీకెందుకు..? దీప్తిపై నాని ఫైర్!

Published : Sep 08, 2018, 11:55 PM ISTUpdated : Sep 09, 2018, 01:29 PM IST
బిగ్ బాస్2: కౌశల్ భార్య సంగతి నీకెందుకు..? దీప్తిపై నాని ఫైర్!

సారాంశం

బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోపై రోజురోజుకి ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది. ఇక శనివారం ఎపిసోడ్ తో 91 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.

బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోపై రోజురోజుకి ప్రేక్షకులకు ఆసక్తి పెరిగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకుంది. 
ఇక శనివారం ఎపిసోడ్ తో 91 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షో హైలైట్స్ విషయానికొస్తే.. తనీష్ పుట్టినరోజు కానుకగా అతడికి గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు. అలానే అతడి సినిమా 'రంగు' ట్రైలర్ ని హౌస్ లో ప్లే చేసి చూపించారు.

కౌశల్ భార్యపై దీప్తి నిన్నటి ఎపిసోడ్ లో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కౌశల్ భార్య అతడితో ఎలా వేగుతుందో అనే అర్ధం వచ్చే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నాని ఈ విషయంపై దీప్తికి చురకలు అంటించారు. హౌస్ మేట్స్ ఒకరిపై మరొకరు అభిప్రాయాలు చెప్పుకోవచ్చు కానీ పర్సనల్ విషయాల జోలికి పోవద్దని నేను మొదటి నుండి చెబుతున్నామని కానీ కౌశల్ భార్య గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దీప్తిని ప్రశ్నించారు.

అయితే నేను ఆమె ఓపిక గురించి మాత్రమే అన్నానని తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేసింది దీప్తి. దీనికి కౌంటర్‌గా ఇలాంటి కామెంట్స్ మీపైన చేస్తే మీరు ఇలాగే స్పందిస్తారా? అంటూ నాని ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్