సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా "కథలో రాజకుమారి" విడుదల

Published : Sep 11, 2017, 07:40 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా "కథలో రాజకుమారి" విడుదల

సారాంశం

నారా రోహిత్‌, నాగశౌర్య, నమితా ప్రమోద్‌, నందిత ప్రధాన పాత్రధారులుగా 'కథలో రాజకుమారి' మహేష్‌ సూరపనేని దర్శకత్వంలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు నిర్మిస్తున్న చిత్రం రాజేష్‌ వర్మ సిరువూరి సమర్పణ, సెప్టెంబర్  15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు

నారా రోహిత్‌, నాగశౌర్య, నమితా ప్రమోద్‌, నందిత ప్రధాన పాత్రధారులుగా మహేష్‌ సూరపనేని దర్శకత్వంలో రాజేష్‌ వర్మ సిరువూరి సమర్పణలో సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరం సుధాకర్‌రెడ్డి, కృష్ణవిజరు నిర్మిస్తున్న చిత్రం 'కథలో రాజకుమారి'. సెన్సార్ సహా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రమిది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్  15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 

శ్రీముఖి, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్‌, రాజీవ్‌ కనకాల, అజరు, ప్రభాస్‌ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా-విశాల్‌ చంద్రశేఖర్‌, కెమెరా: నరేష్‌ కె రానా. ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌. దర్శకత్వం: మహేష్ సూరపనేని. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే