శేఖర్ కమ్ముల సినిమాకు కార్తీ ట్విస్ట్

Surya Prakash   | Asianet News
Published : Aug 24, 2021, 11:05 AM IST
శేఖర్ కమ్ముల సినిమాకు కార్తీ ట్విస్ట్

సారాంశం

ఈలోగా ఇలాంటి కాన్సెప్టుతో తెరకెక్కిన `మద్రాస్` సినిమా విడుదలకు సిద్దమైంది. అదీ అల్లాటప్పా వ్యవహారం అయితే ఎవరూ పట్టించుకోరు. అటు వైపు ఉన్నది స్టార్ హీరో కార్తి. అతనూ తమిళ హీరోనే. అంతేకాక అది ఆల్రెడీ హిట్టైన సినిమా తెలుగు వెర్షన్. 

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పటి చెన్నై ఒకప్పటి `మద్రాస్` నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. మద్రాసు నుంచి తెలుగు వారు విడిపోయినప్పటి ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈలోగా ఇలాంటి కాన్సెప్టుతో తెరకెక్కిన `మద్రాస్` సినిమా విడుదలకు సిద్దమైంది. అదీ అల్లాటప్పా వ్యవహారం అయితే ఎవరూ పట్టించుకోరు. అటు వైపు ఉన్నది స్టార్ హీరో కార్తి. అతనూ తమిళ హీరోనే. అంతేకాక అది ఆల్రెడీ హిట్టైన సినిమా తెలుగు వెర్షన్. ఖచ్చితంగా ఈ విషయం శేఖర్ కమ్ముల టీమ్ కు కంగారు పుట్టించేదే. 

వివరాల్లోకి వెళ్తే..కార్తీ హీరోగా 2014లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘మద్రాస్’ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. దర్శకుడు పా. రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘మద్రాస్’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ లో ‘మద్రాస్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని, ఇతర వివరాలను వీలువెంబడి తెలియచేస్తామని అన్నారు. కార్తీ, కలైరసన్ హరికృష్ణన్, కేథరిన్ త్రేసా, రిత్విక ప్రధాన పాత్రలు పోషించిన ‘మద్రాస్’ చిత్రానికి భారతీబాబు రచన చేయగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చాడు.

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు