కోన్ బనేగా కరోడ్ పతి..  కంటెస్టెంట్ ని తాకనీయని అమితాబ్.. కారణం?

Published : Aug 24, 2021, 10:20 AM IST
కోన్ బనేగా కరోడ్ పతి..  కంటెస్టెంట్ ని తాకనీయని అమితాబ్.. కారణం?

సారాంశం

సీజన్ 13 కేబీసీ ప్రోమో విడుదల కావడం జరిగింది. ఈ సీజన్ మొదటి కంటెస్టెంట్ ని ప్రోమోలో పరిచయం చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జ్ఞ్యాన్ రాజ్ ఫస్ట్ ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు. 


బాలీవుడ్ మోస్ట్ పాప్యులర్ షో కోన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13 గ్రాండ్ గా ప్రారంభమైంది. లెజెండరీ హీరో అమితాబ్ మరోమారు హాట్ సీట్ లోని కంటెస్టెంట్స్ ని తన ప్రశ్నలతో టెన్షన్ పెట్టనున్నారు. సీజన్ 13 కేబీసీ ప్రోమో విడుదల కావడం జరిగింది. ఈ సీజన్ మొదటి కంటెస్టెంట్ ని ప్రోమోలో పరిచయం చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జ్ఞ్యాన్ రాజ్ ఫస్ట్ ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు. ఇక జ్ఞ్యాన్ రాజ్ నేపథ్యం ఏమిటో అమితాబ్ ప్రౌడ్ గా తెలియజేశారు.

 
సైన్స్ టీచర్ అయిన జ్ఞ్యాన్ రాజ్ రోబోటిక్స్, డ్రోన్స్ కి సంబంధించిన సబ్జెక్టులు చెబుతారు. ఇక పిఎస్ఏ కు ఎంపికైన 100మంది యువ సైంటిస్ట్స్ లో జ్ఞ్యాన్ రాజ్ ఒకరు. ప్రధాన మంత్రికి నూతన ఆవిష్కరణల విషయంలో సలహాదారుగా ఉన్నారని తెలియజేశారు. కేబీసీ సీజన్ 13లో పాల్గొన్న జ్ఞ్యాన్ రాజ్ ని ఓ ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 


ఇక షోలో అమితాబ్ చేయిని తాకడానికి అనుమతి లేదు. ఆయన నా పేరు అడిగారు, అలాగే నీ పేరు చాలా భిన్నంగా ఉంది, దాని వెనుక ఆంతర్యం ఏమిటో, అడిగి తెలుసుకున్నారు. ఇంకా చాలా విషయాలు మా మధ్య చర్చకు వచ్చాయి.. అని జ్ఞ్యాన్ రాజ్ తెలియజేశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో హోస్ట్ అమితాబ్ చేతులు, కాళ్ళు తాకడం నిషేధించడం జరిగింది. అత్యంత ప్రజాదరణ కలిగిన షోగా ఉన్న కేబీసీ భారీ రేటింగ్ దక్కించుకుంటుంది.

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? మళ్లీ సినిమాల్లో రావాలని ఫ్యాన్స్ డిమాండ్
త్రిష ,కాజల్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లుగా కెరీర్ మొదలుపెట్టిన, 8 మంది స్టార్స్ ఎవరో తెలుసా?