
అప్పట్లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘భారతీయుడు’.అవినీతికి లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసిన పోరాటం ప్రజలను ఎంతగానో మెప్పించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు మరోసారి కమల్, శంకర్ ముందుకొచ్చారు. ఆ మధ్యన సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పస్ట్‌లుక్‌ను చిత్ర టీమ్ వదిలింది. ఈ ఫస్ట్‌లుక్ చూస్తే భారతీయుడు సినిమాలో సేనాపతి పాత్ర మన కళ్లదెరుగా కనపడుతుంది.అయితే అనుకున్న విధంగా షూటింగ్ జరగలేదు. రకరకాల సమస్యలు వచ్చాయి.
ముఖ్యంగా కమల్ మేకప్ విషయంలో సమస్యలు రావటం..ఆ తర్వాత ఆయన రాజకీయ కమిట్మెంట్లుతో బిజీ కావటం జరిగింది. అలాగే షూటింగ్‌లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదం, కరోనా ఎఫెక్ట్ లతో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌లకు విభేదాల తలెత్తాయి. దాంతో ఇంక ఈ షూటింగ్ జరగనట్లే అని అందరూ ఫిక్స్ అయ్యిపోయారు. కానీ అప్పటికే నీళ్ల లాగ ఆ సినిమాపై చాలా డబ్బులు ఖర్చు పెట్టేసారు నిర్మాతలు. కమల్, శంకర్‌లతో వాళ్లకు తలెత్తిన విభేదాలు పరిష్కారం కాలేదు. దాంతో కొంత కాలంగా ఈ సినిమా గురించి అప్‌డేట్సే లేవు. మరో ప్రక్క శంకర్.. రామ్ చరణ్ సినిమా బిజీలో ఉన్నారు. కమల్ ‘విక్రమ్’ను మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పరిస్దితిపై కమల్ మాట్లాడారు.
కమల్ రీసెంట్ గా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ త్వరలోనే పున:ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇప్పటిదాకా 60 శాతం షూటింగ్ పూర్తయిందని.. ప్రొడ్యూసర్, డైరక్టర్ శంకర్‌తో మాట్లాడి విభేదాలు పరిష్కరించుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కమల్ తెలిపాడు. ఇది కమల్ ఫ్యాన్స్ కు ఆనందం కలిగించే విషయమే.
ఇక స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న కాజల్ ...తాజాగా భారతీయుడు2 సినిమాలో కీ రోల్ చేస్తోంది. కమల్ హాసన్ సరసన చేస్తున్న ఆమె పాత్ర నెగిటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది. కమల్ కు ఆమె చుక్కలు చూపిస్తుందని అంటున్నారు. ఈ పాత్రను అసలు ఎవరూ ఊహించలేని విధంగా డిజన్ చేసారని చెప్తున్నారు. ఆమెకు 85 సంవత్సరాలు ఉంటాయి కానీ ఆమె దుర్మార్గురాలిగా కనిపించబోతోందని చెప్తున్నారు.
ఇక సినిమా కోసం కాజల్ వర్మ కళ అనే విద్యను నేర్చుకున్నారట. ఈ విషయాన్ని కోలీవుడ్ చిత్ర వర్గాలు వెల్లడించాయి. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఈ లెక్కన ఇంకా భారతీయుడు సీక్వెల్ ఆగిపోలేదని అర్ధమవుతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.