రెండు పాత్రల్లో కార్తి విశ్వరూపం.. అదరగొడుతున్న `సర్దార్‌` ట్రైలర్‌..

Published : Oct 14, 2022, 09:48 PM IST
రెండు పాత్రల్లో కార్తి విశ్వరూపం.. అదరగొడుతున్న `సర్దార్‌` ట్రైలర్‌..

సారాంశం

కార్తి హీరోగా నటిస్తున్న `సర్దార్‌` మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో కార్తి విశ్వరూపం చూపించారు. 

డిఫరెంట్‌ స్టోరీస్‌ ఎంచుకుంటూ సైలెంట్‌ గా హిట్లు అందుకుంటున్నారు కార్తి. తెలుగులో మంచి మార్కెట్‌ పెంచుకున్న కార్తి ఇప్పుడు మరో తమిళ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతున్నారు. ఆయన హీరోగా నటించిన `సర్దార్‌` చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల(అక్టోబర్‌) 21న సినిమా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్‌ ఆకట్టుకుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. 

ఇందులో ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ప్రకాష్‌ పాత్రలో కార్తి నటిస్తున్నారు. సోషల్‌ మీడియా పిచ్చోడు. తను చేసే ప్రతి పని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వాలి, తనకు పేరు రావాలని, తను ట్రెండింగ్‌లో ఉండాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పోలీస్‌ డిపార్ట్ మెంట్‌ మిలటరీకి సంబంధించిన ఓ ముఖ్యమైన ఫైల్‌ మిస్‌ అవ్వడంతో దాన్ని పట్టుకునే బాధ్యత తీసుకుంటారు. అది పట్టిస్తే విపరీతమైన క్రేజ్‌ వస్తుందని ఆయన ఆలోచన. 

దీంతో స్పైగా మారతాడు. తను ఏం చేసినా గుర్తింపు రాదు. ఎందుకంటే స్పైలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం బయటకు చెప్పదు. పూర్తిగా రహస్యంగా ఉంటుంది. ఆ విషయం ముందు తెలియక స్పైగా మారతాడు కార్తి. మరి ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నాడు, తనకు రావాల్సిన గుర్తింపు వచ్చిందా? రాకపోతే ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. ఒక్కసారి స్పైగా మారితే ఎల్లప్పుడూ గూఢచారిగానే ఉండిపోవాలని చెప్పడం ఆకట్టుకుంటుంది. తెలుగు ట్రైలర్‌ సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది. 

ఇందులో స్పైగా కార్తి డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం విశేషం. అయితే కార్తి ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సర్దార్‌గా, పోలీస్‌గా ఆయన కనిపించబోతున్నారు. `సర్దార్‌` కథేంటి అనేది ఇందులో సస్పెన్స్. `అభిమన్యుడు` ఫేమ్‌ పిఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో కార్తి సరసన రాశీఖన్నా, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైలా కీలక పాత్ర పోషిస్తుంది. జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?
Bigg Boss 9 Telugu: తనూజ చరిత్ర మాకు తెలుసు, కళ్యాణ్ ని గెలిపించండి.. యష్మీ, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్