
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి రెండో భార్య తిరిగి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. రాధిక గతంలో కన్నడంలో టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. కానీ కుమార స్వామిని చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఆమె రీ ఎంట్రీ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే కుమార స్వామి భార్య అంటే ఏ నిర్మాతగానో, దర్శకురాలిగానో రీఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తోందట రాధికా కుమారస్వామి.
రాధిక హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడంపై కుమార స్వామి కూడా ఏలాంటి అభ్యంతరం చెప్పలేదట. గతంలో తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ తనయుడిగా కుమారస్వామి సినీ నిర్మాతగా వ్యవహరించారు. ఆ రోజుల్లోనే నటి రాధికతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకుంది..అయితే అప్పటికే కుమార స్వామికి పిల్లలు కూడా ఉన్నారు. అయినా వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు.
నిజానికి రాధిక ఇక కుమారస్వామి రాజకీయ వారసురాలిగా అవతరించాలనే ప్రయత్నంలో ఉంది. కుమారస్వామి మొదటి భార్య కుమారుడు నిఖిల్ ఇటీవలే జాగువార్ సీనిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కుమారస్వామి రెండో భార్య రాధిక తిరిగి హీరోయిన్ గా వస్తోంది. మొత్తానికి కుమారస్వామి భార్య రాధిక సినిమాల్లోకి హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వనుండటం ఇప్పుడు కన్నడ నాట హాట్ టాపికైంది.