ఆ సినిమా చూస్తూ.. బోరుమని ఏడ్చిన కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, ఇంతకీ కారణం ఏంటి...?

Published : Jun 15, 2022, 07:45 AM ISTUpdated : Jun 15, 2022, 07:50 AM IST
ఆ సినిమా చూస్తూ.. బోరుమని ఏడ్చిన కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, ఇంతకీ కారణం ఏంటి...?

సారాంశం

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై బోరున ఏడ్చారు. అది కూడా ఒక సినిమా చూసి ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. ఆయనలోని ఎమోషన్స్ ను తట్టిలేపిన ఆ సినిమా ఏంటీ..? ఎందుకు ఈయన ఇంత ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు అంతటా ఇదే చర్చ. 

ఒక సినిమా ఎంతటివారినైనా కదిలిస్తుంది. భావోద్వేగాలను తట్టిలేపుతుంది. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా.. తమకు కనెక్ట్ అయ్యే పరిస్థితులను సినిమా తీసుకువస్తుంది. అటువంటి సందర్భమే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకు ఎదురయ్యింది. ఒక సినిమా ఆయనలని ఎమోషన్స్ ను బయటకు తీసుకువచ్చింది. ఆయనలోని బాధను బయటపడేలా చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ..? 

పెంపుడు జంతువులకు, మనుషులకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటారు కొందరు. వాటికి ఏమైనా జరిగితే తట్టుకోలేరు కూడా. కొన్నిసార్లయితే కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి ఘటనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకు ఎదురైంది. ఇటీవల ఆయన 777 చార్లీ అనే సినిమా చూశారు. పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అయితే సినిమా చూసిన సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

సినిమా చూస్తూ ఉన్నంత సేపు భావోద్వేగానికి గురయ్యారట. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారట. బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా చూశాక సీఎం బొమ్మై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కుక్కల గురించి అనేక సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారని చెప్పుకొచ్చారు. కుక్కలది షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు. 

 

 

బొమ్మై వ్యక్తిగతంగా జంతు ప్రేమికులు. కుక్కలంటే ఆయనకు మహా ప్రేమ. గతేడాది ఆయన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజా సినిమా చూసినప్పుడు మళ్లీ తన కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతే కాదు సినిమాల పట్ల కూడా బసవరాజు బొమ్మైకు మంచి అవగాహన ఉంది. ఆయన మనసు చాలా సున్నితం. సినిమాకు సంబంధించి ఏ కార్యక్రమం అయినా సరై ఎంత చిన్నది అయినా.. ఆయన కాదనకుండా వస్తారు. 

అంతకు ముందు కూడా కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ మరణం సమయంలో కూడా బసవరాజుబొమ్మై ఇలాగా భావోద్వేగానికి లోను అయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చారు. పునిత్ ను కడసారి వీడ్కొలు పలుకుతూ.. ఆయన నుదురుమీద ముద్దు కూడా పెట్టారు. ఇలా కర్నాటక  సీఎం అప్పుడుప్పుడు ఎమోషనల్ అవుతూ.. వార్తల్లో నిలుస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా