Kushi Shooting: లిటిల్ ఖుషీతో విజయ్ దేవరకొండ, సమంత వైరల్ పిక్

Published : Jun 15, 2022, 06:53 AM ISTUpdated : Jun 15, 2022, 06:54 AM IST
Kushi Shooting: లిటిల్ ఖుషీతో విజయ్ దేవరకొండ, సమంత వైరల్ పిక్

సారాంశం

ఖుషీ సినిమా సెట్ లో లిటిల్ ఖుషీతో సందడి చేశారు విజయ్ దేవరకొండ, సమంత. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ లిటిల్ ఖుషీ ఎవరు...? ఖుషీమూవీతో ఈ లిటిల్ ఖుషీకి సంబంధం ఏమిటి..?   

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ,  సమంత కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా ఖుషీ. శివ‌ నిర్వాణ  డైరెక్షన్ లో... ఖుషీ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా   రీసెంట్‌గా క‌శ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం కొన్ని స‌న్నివేశాలు షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో విజయ్ దేవరకొండతో పాటు సమంత, మేజర్ కాస్ట్ కూడా పాల్గొంటోంది. అయితే ఈ సెట్ లో .. విజ‌య్‌, సామ్ లిటిల్ ఖుషీ  తో దిగిన ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 

ఇంత‌కీ లిటిల్ ఖుషీ ఎవ‌ర‌నే మీ డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదా...? ఈ లిటిల్ ఖుషీ ఎవరో కాదు, డైరెక్టర్ శివ నిర్వాణ కూతురు. షూటింగ్ సెట్ కు శివ నిర్వాణ భార్య,కూతురు ఖుషీ వచ్చారు. శివ కూతురు ఖుషీ సెట్ లో సందడి చేసింది. జిమ్ వేర్‌లో ఉన్న విజ‌య్-సామ్ శివ‌నిర్వాణ క‌పుల్‌తో కలిసి దిగిన స్టిల్‌ను శివ‌నిర్వాణ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఖుషీ అంటూ ల‌వ్ ఎమోజీని పెట్టాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇదే కాదు తన కూతురికి సంబందించిన చాలా వీడియోస్, ఫోటోస్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో శేర్ చేస్తుంటాడు శివ.  

 

ఖుషీ చిత్రంలో క‌న్న‌డ యాక్ట‌ర్ జ‌య‌రాం, స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లైగ‌ర్ ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రోవైపు పూరీ జ‌గ‌న్నాథ్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న కూడా చేస్తున్నాడు. స‌మంత కూడా తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?