`చంద్రముఖి 2` వస్తోంది.. అధికారికంగా ప్రకటించిన లారెన్స్

Published : Jun 14, 2022, 10:34 PM IST
`చంద్రముఖి 2` వస్తోంది.. అధికారికంగా ప్రకటించిన లారెన్స్

సారాంశం

హర్రర్‌ కామెడీ చిత్రాల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ మూవీ `చంద్రముఖి`కి సీక్వెల్‌ వస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక కలిసి నటించిన `చంద్రముఖి` చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా హర్రర్‌ కామెడీ చిత్రాలకు ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో హర్రర్‌ సినిమాలకు పునాది వేసింది. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఇన్నాళ్లకు ఈ సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించారు యూనిట్‌. గతంలో లారెన్స్ `చంద్రముఖి 2` చేస్తున్నట్టు ప్రకటించారు. రజనీకాంత్‌ అనుమతి తీసుకున్నానని, ఆయన బ్లెస్సింగ్స్ తో ఈ చిత్రం చేయబోతున్నట్టు వెల్లడించారు. 

ఇప్పటి వరకు దాని అప్‌డేట్‌ రాలేదు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. `చంద్రముఖి 2` పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేశారు. దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుండటం విశేషం. రజనీకాంత్‌ స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా, వడివేలు కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి చిత్రాన్ని రూపొందించిన పి వాసునే సీక్వెల్‌ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. ఆర్‌డీ రాజశేఖర్‌ కెమెరామేన్‌గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్‌ వర్క్‌ను చూసుకోనున్నారు. 

హర్రర్‌ కామెడీ చిత్రాలు చేయడంలో లారెన్స్ దిట. `కాంచన` సిరీస్‌లతో వరుస విజయాలను అందుకున్నారు. హిందీలోనూ సక్సెస్ కొట్టారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌తో మరో విజయాన్ని అందుకోబోతున్నారని చెప్పొచ్చు. అయితే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది యూనిట్‌. ఇందులో హీరోయిన్లు ఎవరు నటిస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్