రంగస్థలం కోసం రంగంలోకి ఐటమ్ గర్ల్ గా కరీనా

Published : Sep 26, 2017, 06:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
రంగస్థలం కోసం రంగంలోకి ఐటమ్ గర్ల్ గా కరీనా

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్  చరణ్ హీరోగా రంగస్థలం 1985 సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం రంగస్థలం కోసం ఐటమ్ గర్ల్ గా రంగంలోకి కరీనా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు హీరోగా, ఇటు నిర్మాతగా బిజీగా గడువుతున్నాడు. మెగాస్టార్ 151 చిత్రం సైరా నరసింహారెడ్డి కి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ... ఆ చిత్రానికి సంబందించిన నిర్మాణ పనుల్లో చెర్రీగా కాస్త తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరో వైపు సుకుమార్ దర్శకత్వంలోని రంగస్థలం చిత్ర షూటింగ్ లో చెర్రీ పాల్గొనాల్సి ఉంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి రంగస్థలం సెట్స్ ను సందర్శించారు కూడా.

 

ఇక సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాణ పనులతో చరణ్ బిజీగా ఉండడంతో రంగస్థలం షూటింగ్ కు బ్రేక్ పడినట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్ర షూటింగ్ కోసం భారీ ఖర్చుతో విలేజ్ సెట్ ని వేసారట. త్వరలోనే చరణ్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు సినీవర్గాలు అంటున్నాయి.

 

రంగస్థలం చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కూడా ఉంటుందట. అందులో చెర్రి సరసన డాన్స్ చేయడానికి బాలీవుడ్ భామ కరీనా కపూర్ ని రంగం లోకి దించుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే కరీనా కపూర్ ని సంప్రదించారని.. ఐటమ్ సాంగ్ లో నటించేందుకు ఆమె ఉత్సాహం చూపినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకుంటే ప్రియాంక చోప్రాను ఐటమ్ నంబర్ కోసం రంగస్థలం రంగంలోకి దించాలని చూస్తున్నారట.

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్