పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు

Published : Sep 26, 2017, 04:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు

సారాంశం

సియాటెల్ నగరంలో కొన్నేళ్లుగా తెలుగు ఎన్నారైలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రోత్సాహం 2019 నాట్స్ నేషనల్  కన్వెన్షన్  కు ఆర్గనైజింగ్ చైర్మన్ గా శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మీట్ అండ్ గ్రీట్ లో బ్రహ్మానందం, మంచు విష్ణు , ప్రగ్య , ప్రభాస్  శ్రీనును కలిసే అవకాశం

ఉత్తర అమెరికా , వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూతనిస్తోంది. పీపుల్ టెక్ అధినేత శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ స్థాపించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూడేళ్లపాటు మధుర గాయకుడు శ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా కార్యక్రమాన్ని అమెరికా లో నిర్వహించింది

 

గత సంవత్సరం సినిమా నిర్మాణం ప్రారంభించి , నాని హీరోగా , డీ వీ వీ దానయ్య నిర్మించిన నిన్ను కోరి చిత్రం అమెరికా షూటింగ్ మొత్తం లైన్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు నిర్వహించింది.. తాజాగా మంచు విష్ణు, బ్రహ్మానందం , ప్రగ్య జైస్వాల్ ప్రధాన పాత్రల్లో జీ నాగేశ్వర్ రెడ్డి  దర్శకత్వం లో ఆచారి అమెరికా యాత్ర చిత్రం అమెరికా షూటింగ్ లైన్ ప్రొడక్షన్ చేపట్టింది.. ప్రస్తుతం ఈ సంస్థ నందమూరి కళ్యాణరామ్ హీరోగా రూపొందుతున్న 'ఎం.ఎల్.ఏ' చిత్ర నిర్మాణంలో భాగస్వామి గా ఉంది.

 

శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ 2019 సంవత్సరానికి గాను  సియాటెల్ లో జరుగనున్న  నాట్స్ నేషనల్  కన్వెన్షన్  కు ఆర్గనైజింగ్ చైర్మన్ గా నియమితులైనందున , అక్టోబర్ 1 2017 న సియాటెల్ లో భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది మీడియా ఫ్యాక్టరీ . వాటా , వాట్స్ తదితర స్థానిక తెలుగు సంస్థల సహకారం తో జరిగే ఈ కార్యక్రమం  పేరు  మీట్ అండ్ గ్రీట్ బ్రహ్మానందం , మంచు విష్ణు , ప్రగ్య , ప్రభాస్  శ్రీను.

 

ఈ కార్యక్రమానికి హాజరు కాదలచిన వారు ఈవెంట్ బ్రైట్ అను ఈ కింద లింక్ ద్వారా వారి ఆగమనాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చును.Meet and Greet AAY Movie Crew (Brahmanandam, Manchu Vishnu, Pragna Jaiswal, Nageswar Reddy, Prabhas Seenu, Praveen, Surekha Vani).

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?